TG Inter 1st Year Admissions 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ వచ్చింది. ప్రథమ సంవత్సర అడ్మిషన్ల గడువును ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కో-ఆపరేటివ్, గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ గడువు వర్తిస్తుంది.
గడువు పొడిగింపు…

మొదటి విడత అడ్మిషన్ల గడువు మంగళవారంతోనే ముగిసిపోయింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు…. ఈ గడువును నెలాఖరు వరకు అవకాశం కల్పించారు.
ఇటీవల పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఇంటర్‌లో చేరాల్సి ఉంది. వీరందరికీ తాజా నిర్ణయంతో కాలేజీల్లో దరఖాస్తు చేసుకునేందుకు తగిన సమయం దొరికినట్లయింది.
మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెకండ్ బోర్డ్ పదో తరగతి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఈ బోర్డు విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యా విధానంలోకి మారేందుకు వీలుగా అడ్మిషన్ల ప్రక్రియను జూలై చివరి వరకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఎలాంటి హడావుడి లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపుల్లో, నచ్చిన కళాశాలల్లో ప్రవేశాలు పొందే వీలుంది. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు హెచ్చరించింది. కేవలం టెన్త్ క్లాస్ జీపీఏ (GPA) మరియు సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలి. నిబంధనలు అతిక్రమిస్తే సదరు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అలాగే.... ప్రైవేట్ కళాశాలలు ఒక్కో సెక్షన్‌కు కేవలం 88 మందిని మాత్రమే చేర్చుకోవాలని, బోర్డు అనుమతించిన సెక్షన్ల కంటే అదనంగా విద్యార్థులను చేర్చుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
{{/usCountry}}ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు హెచ్చరించింది. కేవలం టెన్త్ క్లాస్ జీపీఏ (GPA) మరియు సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలి. నిబంధనలు అతిక్రమిస్తే సదరు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అలాగే.... ప్రైవేట్ కళాశాలలు ఒక్కో సెక్షన్‌కు కేవలం 88 మందిని మాత్రమే చేర్చుకోవాలని, బోర్డు అనుమతించిన సెక్షన్ల కంటే అదనంగా విద్యార్థులను చేర్చుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
{{/usCountry}}ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో ఒక కీలక మార్పును ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పును అరికట్టడానికి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా 'యాంటీ డ్రగ్ అఫిడవిట్' సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థుల భద్రత, ముఖ్యంగా బాలికల రక్షణ కోసం ప్రిన్సిపాల్స్ తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది.