తెలంగాణ డీజీపీ బీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు టాప్ కమాండర్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ, అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, బడె చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఇటీవల లొంగిపోయారు. అయితే ఆ సమయంలో వేదికపైన చీర కట్టులో కనిపించిన వ్యక్తి ఎవరో కాదు.. ఐపీఎస్ అధికారిణి బి.సుమతి. మావోయిస్టులు లొంగిపోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా లొంగుబాట్లు అయ్యేలా చూడటంలో ముందు ఉన్నారు.

మావోయిస్టు అగ్రనేతలు ఆయుధాలు వదులుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు సుమతి. తెలంగాణ పోలీస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌కు ఐజీగా పని చేస్తున్నారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చేలా చాలా కాలంగా పని చేస్తున్నారు. బయటకు వస్తే కలిగే ఉండే ప్రయోజనాలు, ఉద్యమం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నడవలేదని వారికి అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించారు.
దేవూజీ లొంగిపోయిన సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారిణి సుమతి, గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్ఐబీ టీమ్‌ను అభినందించారు. 'స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి, ఎస్ఐబీ బృందం చేసిన అద్భుతమైన ప్రయత్నాల కారణంగా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, ప్రధాన స్రవంతిలో చేరడంలో కీలక పాత్ర పోషించారు.' అని రెడ్డి అన్నారు.
నిజానికి సీనియర్ మావోయిస్టులు లొంగిపోవడానికి ఎస్ఐబీ టీమ్ చాలా ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ పనితో ముందుకు వెళ్లింది. ఎలాంటి హడావుడి లేకుండా, ఒక్క తూటా పేలకుండా అగ్రనేతలను జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు కృషి చేసింది.
ఎస్ఐబీ ఒక్కటే నమ్మింది.. మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతే 'అమరవీరులు' అవుతారు. వారిని అరెస్టు చేస్తే 'హీరోలు' అవుతారు, అదే వారు లొంగిపోతే 'జీరోలు' అవుతారు' అనే సూత్రంతో పనిచేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన కీలక మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మాదిరిగా కాకుండా దేవూజీకి మావోయిస్టు మార్గాన్ని విడిచిపెట్టే ఆలోచన లేదు అని తెలుస్తోంది. కానీ ఆయన లొంగిపోయేలా చేయడంలో ఐపీఎస్ సుమతి చాలా సక్సెస్ అయ్యారని, ఇందుకోసం చాలా శ్రమించారని సమాచారం.
{{/usCountry}}ఎస్ఐబీ ఒక్కటే నమ్మింది.. మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతే 'అమరవీరులు' అవుతారు. వారిని అరెస్టు చేస్తే 'హీరోలు' అవుతారు, అదే వారు లొంగిపోతే 'జీరోలు' అవుతారు' అనే సూత్రంతో పనిచేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన కీలక మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మాదిరిగా కాకుండా దేవూజీకి మావోయిస్టు మార్గాన్ని విడిచిపెట్టే ఆలోచన లేదు అని తెలుస్తోంది. కానీ ఆయన లొంగిపోయేలా చేయడంలో ఐపీఎస్ సుమతి చాలా సక్సెస్ అయ్యారని, ఇందుకోసం చాలా శ్రమించారని సమాచారం.
{{/usCountry}}బి.సుమతి గతంలో కౌంటర్-ఇంటెలిజెన్స్ సెల్‌లో పనిచేసినప్పుడు సీక్రెట్ ఆపరేషన్స్ అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2001 బ్యాచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సుమతి మొదట వరంగల్‌లో నియమితులయ్యారు ఆ తర్వాత 2007లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. ఆమె సీఐడీలో డీఐజీగా కూడా పనిచేశారు. కేవలం 25 ఏళ్ల వయసున్న సమయంలో 2004లో శాంతి చర్చలను దగ్గర ఉండి చూశారు.