...
...
Next Story

తెలంగాణలో వర్షపాతం లోటు కారణంగా ఖరీఫ్ పంట నష్టం రూ. 20,000 కోట్లు!

తెలంగాణలో వర్షపాత లోటు కనిపిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షపాత లోటు కారణంగా ఖరీఫ్ పంటలకు రూ. 20,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

Published on: Oct 12, 2026, 20:52:40 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ రంగానికి సుమారు రూ.20,000 కోట్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వర్షపాతం తగ్గడం వల్ల సాగు విస్తీర్ణం పడిపోవడం, వర్షాల్లేక చేతికి వచ్చిన పంటలు ఎండిపోవడం, వేలాది ఎకరాల భూములు సాగుకు నోచుకోకపోవడం వల్ల ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని వర్సిటీ నిపుణులు అంచనా వేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పత్తి విస్తారంగా సాగయ్యే పంట కావడంతో ఖరీఫ్‌లో పత్తి రైతులకే అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

సాధారణంగా అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడే రబీ సీజన్ సాగు సాధారణంగా 1.3 కోట్ల ఎకరాల్లో జరుగుతుంది. అయితే వర్షాభావం కారణంగా ఇది ఈసారి ఏకంగా 70 లక్షల ఎకరాలకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేశారు.

సాధారణంగా రబీలో సుమారు 60 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. కానీ ప్రస్తుత నీటి ఎద్దడి దృష్ట్యా వరి సాగు విస్తీర్ణం కనీసం 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వీసీ జానయ్య స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ అంశంపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల (ఉదాహరణకు పెసర్లు, మినుములు, నువ్వులు, జొన్నలు) వైపు రైతులను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో రైతులు నష్టాలను వీలైనంత తగ్గించుకునే మార్గాలను ఎంచుకోవాలని యూనివర్సిటీ సూచించింది. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగుకు సంబంధించిన విషయంలో, ముందే పొలంలో ఉన్న నేల తేమ, లభ్యమయ్యే నీటి వనరులను కచ్చితంగా అంచనా వేసుకోవాలి.

సాగు విస్తీర్ణంలో తగ్గుదల, తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల ఉన్న పంటలకు నష్టం, సాగు చేయని భూమి నుండి కలిగే నష్టాలను అంచనా వేసిన తర్వాత ఈ అధ్యయనాన్ని వెల్లడించింది. మెుత్తం ఖరీఫ్ నష్టాలను 20 వేల కోట్లుగా యూనివర్సిటీ అంచనా వేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks