తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాలు జపించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం!

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు పవిత్రమైన స్థానం ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, శ్రీమహావిష్ణువుకు ప్రియమైనదిగా భక్తులు భావిస్తారు. ఉదయం తులసి మొక్కకు నీరు సమర్పించేటప్పుడు ప్రత్యేక మంత్రాలను జపించడం, ప్రదక్షిణలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. 

Published on: Oct 12, 2026, 14:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ ధర్మంలో తులసి మొక్కకు దైవిక స్థానం ఉంది. ఏ ఇంట అయితే తులసి మొక్క ఉంటుందో, అక్కడ సాక్షాత్ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రియమైన మొక్క కావడంతో నిత్యం తులసిని పూజించడం, నీరు సమర్పించడం మన సంప్రదాయంలో వస్తోంది. అయితే, కేవలం నీళ్లు పోయడమే కాకుండా కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాలు జపించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం!
తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాలు జపించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం!

పూజ చేసే సమయంలో ఈ మంత్రాలను జపించండి

ఉదయం పూట తులసి మొక్కకు నీరు సమర్పించే సమయంలో ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం. ఈ మంత్రాలను భక్తిశ్రద్ధలతో ఉచ్చరించడం ద్వారా మనసులోని ఆందోళనలు తొలగిపోయి, కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుంది.

మహాప్రసాద జనని, సర్వ సౌభాగ్య వర్దిని

ఆధి వ్యాధి హరా నిత్యం తులసి త్వం నమోస్తుతే..

ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే.. తులసి దేవి మీరు దేవుని మహా ప్రసాదాన్ని ప్రసాదించేవారు, సకల సౌభాగ్యాలను చేకూర్చేవారు. శారీరక, మానసిక బాధలను హరించే తులసి తల్లికి మీకు నమస్కారాలు.

అలాగే “ఓం తులస్యై నమః”, “ఓం సుభద్రాయై నమః”, “ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా” వంటి మంత్రాలను కూడా పూజా సమయంలో స్మరించుకోవచ్చు.

నీరు పోసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

తులసి మొక్కకు నీరు సమర్పించేటప్పుడు దిశ చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి నీరు పోయడం అత్యంత శుభదాయకం. ఇలా చేయడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే నీరు సమర్పించిన తర్వాత మొక్క చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయడం మంచిది. ప్రదక్షిణ చేసే సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ తులసి నామాలను స్మరించాలి. ఎవరితోనూ గొడవపడకుండా ప్రశాంతంగా పూజను ముగించాలి.

తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

తులసి పూజలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎప్పుడూ కూడా మలినమైన లేదా అశుద్ధమైన చేతులతో తులసి మొక్కను తాకకూడదు.

నీరు పోసేందుకు రాగి చెంబుని ఉపయోగించడం చాలా శ్రేయస్కరం.

అదే విధంగా ఆదివారం, ఏకాదశి తిథులతో పాటు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడిన రోజుల్లో తులసికి నీరు పోయకూడదని పెద్దలు చెబుతుంటారు.

ఈ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More