Telangana Govt Employees : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కీలక సమావేశం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సుదీర్ఘంగా ప్రస్తావించారు. ప్రధానంగా కొత్త పీఆర్సీ (PRC) నివేదిక, ఉద్యోగుల ఉచిత వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు, దీర్ఘకాలంగా నిలిచిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ నిబంధనల అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాకుండా సాధారణ బదిలీలతో పాటు తీవ్ర వివాదాస్పదమైన 317 జీవో బదిలీల బాధితుల సమస్యలపై ఈ కౌన్సిల్ భేటీలో విస్తృతంగా చర్చించారు.
జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డులు - సీఎస్ ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు… రాబోయే జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులను లాంఛనంగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
దీనితో పాటు సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన ఆర్థికేతర సమస్యలను వీలైనంత త్వరగా, సానుకూలంగా పరిష్కరించాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికకు సంబంధించి వీలైనంత నివేదికను తెప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. ఆ దిశగా పీఆర్సీ కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జిల్లా స్థాయిల్లోనూ కౌన్సిల్ సమావేశాలు
సచివాలయ స్థాయిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా… ఆధునిక టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకుంటూ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఉద్యోగులు, సంఘాల నాయకులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
{{/usCountry}}సచివాలయ స్థాయిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా… ఆధునిక టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకుంటూ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఉద్యోగులు, సంఘాల నాయకులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
{{/usCountry}}