గోదావరి జిల్లాలకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కామెంట్స్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ… సీరియస్ కామెంట్స్ చేశారు.
ఒక్క సినిమా కూడా ఆడదు - మంత్రి కోమటిరెడ్డి

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారన్నారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని హెచ్చరించారు. చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడంటూ కితాబునిచ్చిన కోమటిరెడ్డి…. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
"పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోం. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు" అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేశారు.
పవన్ పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్…
పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఉన్న అక్కసు ఏంటో రాజోలు లో చేసిన వ్యాఖ్యలతో బయటపడిందన్నారు.
“సినిమాలు షూటింగ్ లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరం. కానీ తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడింది. ఎర్ర జెండా నుండి కాషాయం జెండాకు మారినట్టు, తెలంగాణ పై పవన్ వైఖరి అలానే మార్చాడు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవ పరిచేలా ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, అసలు ఈ ప్రాంతమే వద్దనుకుంటే తెలంగాణ వదిలి ఏపీలోనే ఉండాలి. పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు” అని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.
{{/usCountry}}“సినిమాలు షూటింగ్ లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరం. కానీ తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడింది. ఎర్ర జెండా నుండి కాషాయం జెండాకు మారినట్టు, తెలంగాణ పై పవన్ వైఖరి అలానే మార్చాడు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవ పరిచేలా ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, అసలు ఈ ప్రాంతమే వద్దనుకుంటే తెలంగాణ వదిలి ఏపీలోనే ఉండాలి. పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు” అని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.
{{/usCountry}}ఇటీవలే మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలింది అని మాట్లాడినందుకు ఇక్కడి ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలది నరదిష్టి అయితే… హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని విజయవాడ వెళ్ళిపో అంటూ సీరియస్ అయ్యారు.
మొత్తంగా కోనసీమ జిల్లాల పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అని… తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తూ… వార్నింగులు ఇస్తున్నారు.