'పవన్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు' - మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే.. తెలంగాణలో ఆయన సినిమాలు కూడా ఆడవని హెచ్చరించారు.

Published on: Dec 2, 2025, 13:10:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గోదావరి జిల్లాలకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కామెంట్స్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ… సీరియస్ కామెంట్స్ చేశారు.

డిప్యూటీ సీఎంపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
డిప్యూటీ సీఎంపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

ఒక్క సినిమా కూడా ఆడదు - మంత్రి కోమటిరెడ్డి

పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పవన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్‌ విషం తాగారన్నారు. పవన్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని హెచ్చరించారు. చిరంజీవి సూపర్‌ స్టార్‌.. ఆయన మంచోడంటూ కితాబునిచ్చిన కోమటిరెడ్డి…. రాజకీయ అనుభవం లేకే పవన్‌ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

"పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోం. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు" అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేశారు.

పవన్ పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్…

పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఉన్న అక్కసు ఏంటో రాజోలు లో చేసిన వ్యాఖ్యలతో బయటపడిందన్నారు.

“సినిమాలు షూటింగ్ లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరం. కానీ తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడింది. ఎర్ర జెండా నుండి కాషాయం జెండాకు మారినట్టు, తెలంగాణ పై పవన్ వైఖరి అలానే మార్చాడు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవ పరిచేలా ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, అసలు ఈ ప్రాంతమే వద్దనుకుంటే తెలంగాణ వదిలి ఏపీలోనే ఉండాలి. పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు” అని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.

ఇటీవలే మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలింది అని మాట్లాడినందుకు ఇక్కడి ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలది నరదిష్టి అయితే… హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని విజయవాడ వెళ్ళిపో అంటూ సీరియస్ అయ్యారు.

మొత్తంగా కోనసీమ జిల్లాల పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అని… తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తూ… వార్నింగులు ఇస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More