TG Model School Notfication 2026 : తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు - దరఖాస్తులు ప్రారంభం, ప్రాసెస్ ఇలా

తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 28వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Jan 28, 2026, 17:33:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది.

తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు… ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.

టీజీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు - దరఖాస్తు విధానం

  1. ముందుగా https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ఆరో తరగతి, 7 నుంచి 10వ తరగతి నోటిఫికేషన్ల లింక్ లు కనిపిస్తాయి.
  3. చివరల్లో ఆన్ లైన్ పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  4. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ విద్యార్థులు రూ. 125, ఓసీ విద్యార్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి.
  5. ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ వివరాలతో పాటు విద్యార్థి ఫొటోను సబ్మిట్ చేయాలి.
  6. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
  7. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఆరో తరగతి ప్రవేశాలకు 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలుంటాయి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 19వ తేదీన విద్యార్థులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫలితాలను https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More