...
...
Next Story

TG Model School Admissions 2026 : తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

TG Model School Notfication 2026 :తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తులపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 28వ తేదీతో గడువు ముగియగా… మార్చి 10వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్‌ 19న ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Mar 1, 2026, 06:43:20 IST
Advertisement

తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఫిబ్రవరి 28వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించారు.

ఏప్రిల్ 19న ఎంట్రెన్స్ ఎగ్జామ్….

మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు
మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ విద్యార్థులు రూ. 125, ఓసీ విద్యార్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.

టీజీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు - అప్లికేషన్ ప్రాసెస్

  1. ముందుగా https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ఆరో తరగతి, 7 నుంచి 10వ తరగతి నోటిఫికేషన్ల లింక్ లు కనిపిస్తాయి.
  3. చివరల్లో ఆన్ లైన్ పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  4. ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ వివరాలతో పాటు విద్యార్థి ఫొటోను సబ్మిట్ చేయాలి.
  5. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
  6. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

పరీక్షా విధానం…

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్-మీడియం విద్యను అందించడానికి తెలంగాణ మోడల్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర సిలబస్‌తో పనిచేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. పాఠశాల విద్యా శాఖ ఏప్రిల్ 19న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 నిర్వహిస్తుంది.

పరీక్షలు సంబంధిత మండలాల్లోని పాఠశాలల్లో నిర్వహిస్తారు. ఆరో తరగతి విద్యార్థుల హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 1 నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. VII నుండి X తరగతుల దరఖాస్తుదారులు ఏప్రిల్ 9 నుండి వారి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో వచ్చే సమస్యలను నివారించడానికి విద్యార్థులు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks