TG TRANSCO : టీజీ ట్రాన్స్‌కో అప్రెంటిస్ నోటిఫికేషన్ - 250 ఖాళీలు, దరఖాస్తు తేదీలివిగో

టీజీ ట్రాన్స్ కో నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 250 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.టీజీ ట్రాన్స్‌కోలో 250 అప్రెంటిస్ పోస్టులు - నెలకు స్టైఫండ్, దరఖాస్తు తేదీలివే

Published on: Feb 22, 2026, 06:33:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీ ట్రాన్స్ కో) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు… ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీ ట్రాన్స్‌కో అప్రెంటిస్ నోటిఫికేషన్
టీజీ ట్రాన్స్‌కో అప్రెంటిస్ నోటిఫికేషన్

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల విభాగంలో 125 పోస్టులు, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌ల విభాగంలో 125 పోస్టులను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లుగా ఎంపికైన వారికి నెలకు రూ. రూ.17,500 స్టైపెండ్, డిప్లోమా అప్రెంటిస్ లుగా ఎంపికైన వారికి రూ. 15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్ లేదా ఐటీ విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక డిప్లోమా అప్రెంటిస్ కు అయితే డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌సీ విభాగంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులు 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో పాసే ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

టీజీ ట్రాన్స్ కో అప్రెంటిస్ నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు :

  • అప్రెంటిస్ నోటిఫికేషన్ - ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్
  • అప్రెంటిస్ ఖాళీలు - 250
  • దరఖాస్తులకు చివరి తేదీ - 27 ఫిబ్రవరి 2026(టీజీ ట్రాన్స్ కో పోర్టల్ ద్వారా)
  • NATS పోర్టల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ - 26 ఫిబ్రవరి 2026. (https://nats.education.gov.in/)
  • ఎంపిక విధానం - అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
  • ఏడాదికి కాలానికిగానూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన మెయిల్ అడ్రస్ - studentquery@boat-srp.com, applacement@boat-srp.com.
  • అధికారిక వెబ్ సైట్ - https://nats.education.gov.in/ , https://tgtransco.com/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More