HPCL Recruitment 2026 : నెలకు రూ. 25వేల స్టైఫండ్‌తో హెచ్పీసీఎల్లో అప్రెంటిస్ పోస్టులు- వివరాలు..
నిరుద్యోగులకు అలర్ట్! హిందుస్థాన్ పెట్రోలియంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ నడుస్తోంది. నెలకు రూ. 25వేల వరకు స్టైఫండ్ లభించే ఈ అప్రెంటిస్ నియామకం వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు తీపి కబురు అందించింది. ఈ మేరకు 2026 సంవత్సరానికి గాను 'గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ' (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న హెచ్‌పీసీఎల్ యూనిట్లలో మొత్తం 608 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026- అర్హతలు, విద్యాభ్యాసం..
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది విభాగాల్లో బీఈ./బీటెక్ పూర్తి చేసి ఉండాలి:
సివిల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
ముఖ్యమైన కండిషన్:
అభ్యర్థులు తమ డిగ్రీని ఏప్రిల్ 01, 2023 నాటికే పూర్తి చేసి ఉండాలి.
జనరల్/ ఓబీసీ-ఎన్సీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు ఉండాలి.
వయోపరిమితి (02 మార్చి 2026 నాటికి)-
కనీస వయస్సు: 18 ఏళ్లు
గరిష్ట వయస్సు: 25 ఏళ్లు
వయో సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ- ఎన్‌సీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ) 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026- స్టైఫండ్ వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 స్టైఫండ్ లభిస్తుంది. ఇందులో:
హెచ్‌పీసీఎల్ వాటా: రూ. 20,500
భారత ప్రభుత్వం (డీబీటీ స్కీమ్ ద్వారా): రూ. 4,500
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026- ట్రైనింగ్ స్లాట్లు..
ఈ దఫా అప్రెంటిస్ రిక్రూట్మెంట్లో మహారాష్ట్రలో అత్యధికంగా 114 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 62, కర్ణాటకలో 44, తమిళనాడులో 35, తెలంగాణలో 22 పోస్టులు ఉన్నాయి.
Bank jobs : నెలకు రూ. 86వేల వరకు జీతం- ఎస్బీఐ సీబీఓ అప్లికేషన్‌కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026- ఎంపిక విధానం..
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ప్రధానంగా కింది దశల్లో ఎంపిక జరుగుతుంది:
- డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల స్క్రీనింగ్.
- 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్.
- సర్టిఫికేట్ల వెరిఫికేషన్.
- మెడికల్ ఫిట్‌నెస్, పోలీస్ వెరిఫికేషన్ అనంతరం తుది జాబితా విడుదల.
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com సందర్శించండి.
స్టెప్ 2- 'Careers' సెక్షన్‌లోకి వెళ్లి 'Apprentice Recruitment 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 4- దరఖాస్తును సమర్పించిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ఒక కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ 02 మార్చి 2026 అని గుర్తుపెట్టుకోవాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్సించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


