ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
మీ SSC సర్టిఫికేట్లో తప్పులా? మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ఇదిగో
పదో తరగతి మార్కుల మెమోలో తప్పుల సవరణకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. తమ ఒరిజినల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(SSC) మెమోలలో సవరణలు కోరుకునే విద్యార్థులు మీసేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పదో తరగతి ఒరిజినల్ మెమోలలో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లితే, వాటిని సరిచేయించుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఇకపై ఉండదు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ సర్టిఫికెట్ల సవరణ ప్రక్రియ మొత్తాన్ని ఇక మీదట మీసేవ(MeeSeva) పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్లలోని వివరాల సవరణ ప్రతిపాదనల సమర్పణ, పరిశీలన ప్రక్రియ మొత్తం ఇకపై మీసేవ పోర్టల్ ద్వారానే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఎవరూ కూడా విద్యార్థుల నుండి నేరుగా సవరణ దరఖాస్తులను స్వీకరించవద్దని, విద్యాశాఖకు పంపవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
గతంలో టెన్త్ మార్కుల మెమోలో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ మార్చుకోవాలంటే విద్యార్థులు బ్యాంక్ చలాన్ ద్వారా ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలతో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఫైళ్లు కదలడంలో తీవ్ర జాప్యం జరిగేది. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి కొత్త మెమో జారీ అయ్యే వరకు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, డిజిటల్ పద్ధతిలో 6 దశల్లో సాగుతుంది.
- సవరణ కోరుకునే అభ్యర్థులు ముందుగా సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి, సంబంధిత ఆధారాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి.
- మీసేవలో సమర్పించిన దరఖాస్తు ఆన్లైన్లోనే నేరుగా విద్యార్థి 10వ తరగతి చదివిన పాఠశాలకు వెళ్తుంది. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ISMS పోర్టల్‌లోని స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో వివరాలను పరిశీలిస్తారు. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, కామెంట్స్ నమోదు చేస్తారు.
- పాఠశాల నుండి దరఖాస్తు మండల విద్యాధికారి లాగిన్‌కు వెళ్తుంది. ఎంఈఓ దానిని పరిశీలించి ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు.
- ఎంఈఓ ఆమోదం తర్వాత దరఖాస్తు జిల్లా విద్యాధికారి కార్యాలయానికి చేరుతుంది. అక్కడ క్లర్క్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఆమోదం కోసం డీఈఓ ముందు ఉంచుతారు.
- డీఈఓ ఆమోదం పొందిన తర్వాత, ఆ దరఖాస్తు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ క్లియరెన్స్ లభించగానే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరేట్‌కు చేరుతుంది.
- ప్రభుత్వ పరీక్షల విభాగం తుది ఆమోదం తెలపగానే, తప్పులు సరిదిద్దిన కొత్త ఎస్ఎస్సీ మెమో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు.
కొత్త విధానంలో అధికారుల జవాబుదారీతనాన్ని విద్యాశాఖ మరింత పెంచింది. దరఖాస్తు పరిశీలనలో భాగంగా ఏ దశలోనైనా (పాఠశాల, ఎంఈఓ, డీఈఓ లేదా డైరెక్టరేట్ స్థాయిలో) దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే, సంబంధిత అధికారులు ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలను ఆన్లైన్లో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దరఖాస్తుదారులకు తమ అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుస్తుంది.

E-Paper
