...
...
Next Story

ఎంఎంటీఎస్, మెట్రో, సిటీ బస్సుల కనెక్టివిటీకి ప్లాన్.. అన్నింటికీ ఒకే టికెట్!

హైదరాబాద్‌లో రవాణా సౌకర్యం మరింత మెరుగ్గా చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

Published on: Jan 22, 2026 09:09 AM IST
Advertisement

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైలు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సులను కనెక్ట్ చేసేలా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తోంది. వీటన్నింటినీ అనుసంధానిస్తూ.. సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళిక ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ సబర్బన్ రైలు, మెట్రో రైలు, సిటీ బస్సు సేవలను అనుసంధానించడానికి ప్రణాళికపై కసరత్తు మెుదలుపెట్టింది. దీని ద్వారా మొదటి నుంచి చివరి వరకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జనాలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సేఫ్‌గా వెళ్లేందుకు, సురక్షితమైన రోడ్లు, నమ్మకమైన సేవలపై దృష్టి సారించారు.

ఈ ప్రణాళిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 51 ఎంఎంటీఎస్ స్టేషన్ల చుట్టూ అప్రోచ్ రోడ్లు, పాదచారుల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తుంది ప్రభుత్వం. అయితే దక్షిణ మధ్య రైల్వే ఫుట్‌ఫాల్, క్యాచ్‌మెంట్ డేటాను పంచుకుంటుంది. దీని ఆధారంగా ఎంఎంటీఎస్ స్టేషన్లకు దగ్గరగా ఉన్న బస్ స్టాప్‌లు, మార్గాలను టీజీఎస్ఆర్టీసీ బస్సులు కనెక్ట్ చేస్తాయి.

ప్రభుత్వం జీపీఎస్ పర్యవేక్షణతో ప్రైవేట్ ఫీడర్ సేవలను కూడా ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిద్వారా ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలు సర్వీసులు నడిపే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులలో ఇంటిగ్రేటెడ్ టికెటింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం. దీనిద్వారా అన్నింటికి కలిపి ఒకే టికెట్ తీసుకోవచ్చు. ప్రయాణానికి ముందు టికెట్ తీసుకుని.. ఒకేసారి మెట్రో, బస్సు, ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవచ్చు. మీ సేవా కమిషనర్‌కు మెట్రో, ఎంఎంటీఎస్ రైలు, బస్ ఇంటిగ్రేటెడ్ టికెటింగ్ వ్యవస్థను పరిశీలించాలని సూచనలు వెళ్లాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe