...
...
Next Story

మున్సిపల్ ఎన్నికల్లో 14 స్థానాలు ఏకగ్రీవం.. కాంగ్రెస్ ఖాతాలోకి 12

తెలంగాణలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2,996 వార్డులు, డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందులో కొన్ని ఏకగ్రీవం అయ్యాయి.

Published on: Feb 5, 2026, 11:40:34 IST
Advertisement

మున్సిపల్ ఎన్నికల్లో 2,996 వార్డులు, డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందులో 14 స్థానాలు ఏకగ్రీవం అయినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 12 మంద్రి కాంగ్రెస్ అభ్యర్థులు, ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 11వ పోలింగ్ 2,982 స్థానాలకు జరగనుంది.

ప్రధాన పార్టీల నుంచి

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 12,944 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి చూసుకుంటే.. కాంగ్రెస్‌ తరఫున 2,948, బీజేపీ 2,634, బీఆర్‌ఎస్‌ నుంచి 2,878 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనేక ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతుండటం ఎన్నికలపై ఆసక్తిని పెంచింది.

ఇక ఆప్ నుంచి 98, బీఎస్పీ 213, సీపీఎం 128, ఎంఐఎం 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 298, సీపీఐ 169, ఐయూఎంఎల్‌ 9, జేఎస్పీ 332, ఇతర పార్టీల నుంచి 240 మంది, స్వతంత్ర అభ్యర్థులు 2,786 మంది బరిలో ఉన్నారు.

ఈ జిల్లాల్లో ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లాలోని మునిసిపాలిటీల నుండి నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లాల వారీగా డేటా వెల్లడించింది ఈసీ. వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుండి ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. జోగులాంబ గద్వాల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఒక్కొక్కరు పోటీ లేకుండా ఎన్నికయ్యారు.

పోటీలో వీరు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పోటీదారుల విద్యార్హతలను బట్టి 757 మంది అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కలిగి ఉండగా, 7,985 మంది అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe