భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో నివసిస్తున్న నాయకపోడు తెగ ప్రత్యేకమైన చేతితో తయారు చేసే మాస్క్‌లకు భౌగోళిక గుర్తింపు (GI) ట్యాగ్‌ను పొందే అవకాశం ఉంది. ఈ మాస్కులకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల నుంచి వీటిని తయారు చేస్తున్నారు. కాకతీయ రాజు సింగభూపాల నుంచి ఈ తెగ వారు ఎక్కువగా వెలుగులోకి వచ్చారు.

నాయకపోడు మాస్క్‌లకు జీఐ ట్యాగ్ సాధించడానికి, నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ మద్దతుతో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్(IPFC)లో GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన జీఐ ప్రాక్టిషినర్ శుభజిత్ సాహా, జీఐ రిజిస్ట్రేషన్ కోసం లీగల్ కౌన్సిల్ శ్రీవత్సను కలిసి దరఖాస్తు చేసుకున్నారు.
నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అధ్యక్షుడు పసుల అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఇది తమ తెగకు ఒక మలుపు కావచ్చని అన్నారు. ఇది నాయకపోడు కళలు, చేతిపనులను రక్షించడంలో సహాయపడటమే కాకుండా, పురాతన హస్తకళ రూపాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో కూడా సహాయపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అంజన్ 11 సంవత్సరాల క్రితం సొసైటీని స్థాపించారు. సొసైటీ సభ్యులు మాస్క్‌లను తయారు చేయడంలో, వాటిని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) ద్వారా మార్కెటింగ్ చేయడంలో నిమగ్నం చేస్తున్నారు. వాటిని పలు వేదికలలో ప్రదర్శిస్తున్నారు.
నాయకపోడు తెగ తెలంగాణలోని గోదావరి నది ఒడ్డున ప్రధానంగా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో స్థిరపడ్డారు. కానీ కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించారు. వీరు 14వ శతాబ్దపు రేచర్ల పద్మనాయక రాజవంశ పాలకుడు సర్వజ్ఞ సింగ భూపాలుడికి సేవ చేశారని నమ్ముతారు. భీముడి భార్య హిడింబి తమ ఆడపడుచు అని, భీముడు తమకు చిరుధాన్యాలు పండించడం నేర్పించాడని చెప్పుకుంటున్నారు. అందుకే వారు పాండవులను కొర్రాజులు అని పిలుస్తారు. ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి గ్రామదేవతలుగా వ్యవహరిస్తారు.
ఈ మాస్క్‌లు ఎలా తయారు చేస్తారు?
నాయకపోడు మాస్క్‌లను పొనికి చెట్టు చెక్కతో తయారు చేస్తారు. రంగు రాళ్ళు, చెట్ల సారం, బొగ్గు, బూడిద, అటవీ వనరుల నుండి సేకరించిన సహజ రంగులను మాత్రమే ఉపయోగించి వారు తమ చేతులతో మాస్క్‌లను తయారు చేస్తారు. వీరు ప్రధానంగా కాకతీయ రాజు సింగబోయడు (సింగభూపాలుడు), భూలక్ష్మి దేవర, ఐదుగురు పాండవులు (కొర్రాజులు), పోతరాజు, వరాహ రాజు, ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి, అశ్వం (గుర్రం), ఒక జింక ముఖానికి మాస్క్‌లుగా తయారు చేస్తారు.
{{/usCountry}}నాయకపోడు మాస్క్‌లను పొనికి చెట్టు చెక్కతో తయారు చేస్తారు. రంగు రాళ్ళు, చెట్ల సారం, బొగ్గు, బూడిద, అటవీ వనరుల నుండి సేకరించిన సహజ రంగులను మాత్రమే ఉపయోగించి వారు తమ చేతులతో మాస్క్‌లను తయారు చేస్తారు. వీరు ప్రధానంగా కాకతీయ రాజు సింగబోయడు (సింగభూపాలుడు), భూలక్ష్మి దేవర, ఐదుగురు పాండవులు (కొర్రాజులు), పోతరాజు, వరాహ రాజు, ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి, అశ్వం (గుర్రం), ఒక జింక ముఖానికి మాస్క్‌లుగా తయారు చేస్తారు.
{{/usCountry}}