TG PGECET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET)-2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి… తక్కువ సమయంలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లోని ఎంఈ , ఎంటెక్ (M.Tech), ఎంఫార్మసీ (M.Pharmacy), ఎంఆర్క్ (M.Arch), ఫార్మ్-డి (గ్రాడ్యుయేషన్ అనంతర కోర్సులు) వంటి పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మే 29వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వివిధ సెషన్లలో ఆన్‌లైన్ పద్ధతిలో ) ఈ పరీక్షలు జరిగాయి.
TG PGECET 2026 - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా :
పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక పోర్టల్ నుంచి తమ మార్కులు, సాధించిన ర్యాంకులతో కూడిన స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఫలితాల కోసమైతే రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి పీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత వ్యూ ర్యాంక్ కార్డుపై నొక్కాలి.
- మీ స్క్రీన్‌పై ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
- భవిష్యత్తులో కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం దానిని ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించాలంటే ఈ ప్రవేశ పరీక్షలో కనీసం 30 మార్కులు (మొత్తం 120 మార్కులకు గానూ) సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై లేదా ఆగస్టు నెలల్లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్ల నమోదు మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియల పూర్తి వివరాలను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}జనరల్ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించాలంటే ఈ ప్రవేశ పరీక్షలో కనీసం 30 మార్కులు (మొత్తం 120 మార్కులకు గానూ) సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై లేదా ఆగస్టు నెలల్లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్ల నమోదు మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియల పూర్తి వివరాలను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, వారి రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. సీటు పొందే విద్యార్థులు నిర్దేశించిన తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక కాలేజీల్లో సీట్లు మిగిలితేనే… స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇస్తారు.
ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి TG PGECET 2026 ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.