TG PGECET 2026 Results : తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డు ఇక్కడ చెక్ చేసుకోండి
TG PGECET 2026 Results : తెలంగాణ పీజీ ఈసెట్ (TG PGECET) 2026 ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in ద్వారా తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TG PGECET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET)-2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి… తక్కువ సమయంలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లోని ఎంఈ , ఎంటెక్ (M.Tech), ఎంఫార్మసీ (M.Pharmacy), ఎంఆర్క్ (M.Arch), ఫార్మ్-డి (గ్రాడ్యుయేషన్ అనంతర కోర్సులు) వంటి పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మే 29వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వివిధ సెషన్లలో ఆన్‌లైన్ పద్ధతిలో ) ఈ పరీక్షలు జరిగాయి.
TG PGECET 2026 - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా :
పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక పోర్టల్ నుంచి తమ మార్కులు, సాధించిన ర్యాంకులతో కూడిన స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఫలితాల కోసమైతే రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి పీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత వ్యూ ర్యాంక్ కార్డుపై నొక్కాలి.
- మీ స్క్రీన్‌పై ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
- భవిష్యత్తులో కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం దానిని ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించాలంటే ఈ ప్రవేశ పరీక్షలో కనీసం 30 మార్కులు (మొత్తం 120 మార్కులకు గానూ) సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై లేదా ఆగస్టు నెలల్లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్ల నమోదు మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియల పూర్తి వివరాలను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, వారి రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. సీటు పొందే విద్యార్థులు నిర్దేశించిన తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక కాలేజీల్లో సీట్లు మిగిలితేనే… స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

