హైదరాబాద్‌లోని రోడ్లకు ట్రంప్, రతన్ టాటా, గూగుల్ పేర్లు!
హైదరాబాద్ నగరంలోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లను పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ట్రంప్ పేరు కూడా ఓ రోడ్డుకు పెట్టాలనుకుంటోంది.
హైదరాబాద్‌లో పలు రోడ్లు ప్రముఖుల పేర్లను పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించింది. ప్రపంచంలో ఓ రోడ్డుకు మెుదటిసారిగా ట్రంప్ పేరు పెట్టినట్టవుతుంది.

'ప్రపంచంలో ఇది మొదటిది, గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనుకుంటున్నాం. హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ వెంబడి ఉన్న హై ప్రొఫైల్ రహదారిని 'డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పిలవనున్నారు.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది.
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ఒక రోజు ముందు ఈ ప్రకటన బయటకు వచ్చింది. రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డు(RRR)తో అనుసంధానించే రాబోయే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రావిర్యాల వద్ద ఉన్న ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే 'టాటా ఇంటర్‌చేంజ్' అని పేరు పెట్టారు.
కొత్త 'డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు ప్రతిపాదన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనుంది. ఐటీ కారిడార్‌లో ఒక ప్రముఖ ప్రాంతానికి 'గూగుల్ స్ట్రీట్' అని పేరు పెట్టాలని నిర్ణయించారు. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ పేరు కూడా హైదరాబాద్‌లో ఓ రోడ్డుకు రానుంది. దీనితో పాటు విప్రో జంక్షన్, మైక్రోసాఫ్ట్ రోడ్డు పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తోంది. తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేయాలనుకుంటుంది. మరోవైపు ఇలాంటి పేర్ల ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోడ్ల మీద ప్రయాణించేవారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందని అనుకుంటోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


