...
...
Next Story

TG Police Recruitment : తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలు - దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, అప్లికేషన్ లింక్ వివరాలివే

TS Police Recruitment Applications : 7,437 పోలీసు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంది. ఈసారి అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతో దరఖాస్తుదారుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Published on: Aug 19, 2026, 13:35:46 IST
Advertisement

TS Police Recruitment Applications : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPRB) ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. గత నెలలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు ప్రత్యేక నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, జైళ్లు, ఫైర్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు సెప్టెంబర్ 09వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు
తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు

సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులందరికీ (ఓసీ/బీసీ) రూ.1,500గా ఫీజు ఉంది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులు అప్లై చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులందరికీ రూ.1,200గా ఫీజు నిర్ణయించారు.

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్‌ప్రింట్ బ్యూరో), పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్), పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) వంటి సాంకేతిక పోస్టులకు కూడా ఇదే విధమైన రుసుములు వర్తిస్తాయి. అర్హత కలిగిన పోస్టులకు ప్రాక్టికల్, ట్రేడ్, డ్రైవింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :

పోలీస్ శాఖ….

  • సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్): 148
  • రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఆర్): 14
  • రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (టీజీఎస్పీ): 12
  • రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఏఆర్‌సీపీఎల్): 3
  • అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఎఫ్బీపీ): 23
  • పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697
  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్): 1,052
  • పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్‌సీపీఎల్): 24
  • పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ - పీటీఓ): 20
  • పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ - పీటీఓ): 7

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్):

  • సబ్ ఇన్ స్పెక్టర్: 44
  • కానిస్టేబుల్: 1,380

ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్:

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
  • ఫైర్ ఫైటర్: 751

జైళ్ల శాఖ:

  • డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు): 01
  • వార్డర్ (పురుషులు): 196
  • వార్డర్ (మహిళలు): 02

హోం శాఖతో పాటు ఇతర అనుబంధ విభాగాల్లో జరుగుతున్న ఈ నియామకాల్లో కచ్చితత్వాన్ని పాటించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి అభ్యర్థి సమగ్ర వివరాలను నిక్షిప్తం చేస్తూ ఒక 'యూనిక్ ఐడీ' (విశిష్ట గుర్తింపు సంఖ్య)ని కేటాయిస్తున్నారు. అభ్యర్థి దరఖాస్తు చేసిన క్షణం నుంచి ఉద్యోగానికి ఎంపికయ్యే వరకు లేదా పోటీ నుంచి నిష్క్రమించే వరకు అయ్యే ప్రతి పరిణామాన్ని ఈ ఐడీలోనే రికార్డు చేస్తారు. దీనికోసం ఫామ్-ఏ, ఫామ్-బి పేరుతో ప్రత్యేక ప్రొఫార్మాలను రూపొందించారు.

  • మొదటగా ప్రాథమిక రాతపరీక్ష (Prelims) నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు 'పార్ట్-1' దరఖాస్తును పూర్తి చేయాలి.
  • ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి దశ కోసం 'పార్ట్-2' దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు వారి యూనిక్ ఐడీలో నిక్షిప్తమవుతాయి.
  • పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత శారీరక కొలతల పరీక్ష (PMT), శారీరక సామర్థ్య పరీక్ష (PET)లను నిర్వహిస్తారు.
  • చివరిగా మెయిన్స్ రాతపరీక్ష మార్కులు, స్పెషల్ బ్రాంచ్ (SB) నిర్వహించే అభ్యర్థి పూర్వ చరిత్ర వివరాలను కూడా ఈ ఐడీలోనే పొందుపరుస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
  • అప్లికేషన్ లింక్ - https://www.tgprb.in/applive/register

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe