...
...
Next Story

TG Police Recruitment 2026 : పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు - విభాగాల వారీగా ఖాళీలివే

Telangana Police Recruitment 2026 : తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీస్ శాఖతో పాటు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,437 సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

Published on: Jul 5, 2026, 10:00:25 IST
Advertisement

Telangana Police Recruitment 2026 : పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు భారీ నోటిఫికేషన్ సిద్ధమైంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (నేరుగా భర్తీ) ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

7,437 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్లు
7,437 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్లు

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) కి ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. అయితే ఖాళీల వివరాలను TSLPRB ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

విభాగాల వారీగా భర్తీ చేయనున్న ఖాళీలు

  • సబ్ ఇన్‌స్పెక్టర్ - ఎస్ఐ (సివిల్): 148
  • రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్): 14
  • రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్‌పీ): 12
  • రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3
  • అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB): 23
  • పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697
  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్): 1,052
  • పోలీస్ కానిస్టేబుల్ (SARCPL): 24
  • పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీఓ: 20
  • పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పీటీఓ: 7
  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
  • ఫైర్ ఫైటర్స్: 751
  • డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు): 1
  • వార్డర్ (పురుషులు): 196
  • వార్డర్ (మహిళలు): 12
  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ -
  • SPF సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ): 44
  • కానిస్టేబుల్: 1,380

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అనుమతించిన పోస్టులకు సంబంధించి లోకల్ క్యాడర్ల వారీగా ఖాళీల విభజన, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు మరియు వయోపరిమితి వంటి పూర్తి వివరాలను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సంబంధిత శాఖల అధిపతుల నుంచి బోర్డుకు అందాల్సి ఉంది. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తి కాగానే…. మరికొద్ది రోజుల్లోనే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారికంగా సమగ్ర నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు (IPS) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe