TG POLYCET 2026 Seat Allotment : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ (POLYCET) చివరి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం రాత్రి ఈ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం సీట్లలో నాలుగో వంతు అంటే.. దాదాపు 25 శాతం సీట్లు మిగిలిపోయాయి.
టీజీ పాలిసెట్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా:
- ముందుగా https://tgpolycet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత… అలాట్ మెంట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దీనిపై క్లిక్ చేస్తే మీ అలాట్ మెంట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
- కాలేజీలో రిపోర్టింగ్ చేయాలంటే అలాట్ మెంట్ అర్డర్ కాపీని తప్పనిసరిగా ఉండాలి.

రాష్ట్రంలో మొత్తం 112 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాతో కలుపుకొని మొత్తం 33,535 సీట్లు ఉండగా….. తాజా కౌన్సిలింగ్ ముగిసే సమయానికి 25,111 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. అంటే మొత్తం సీట్లలో 74.88 శాతం సీట్లు భర్తీ కాగా, ఇంకా 8,424 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వారీగా చూస్తే విద్యార్థులు సర్కారు కాలేజీల్లో చేరడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అయితే ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం కేవలం 54 శాతం సీట్లు మాత్రమే నిండాయి.
రిపోర్టింగ్ గడువు….
టీజీ పాలిసెట్ చివరి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను తీసుకుని… ఈ నెల 23వ తేదీ లోపు తాము సీటు సాధించిన సంబంధిత కళాశాలల్లో నేరుగా వెళ్లి రిపోర్ట్ చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. గడువులోగా రిపోర్ట్ చేయని వారి సీట్లు రద్దవుతాయి.
ఇప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సు లేదా బ్రాంచిని మార్చుకోవాలనుకుంటే వారికి మరో అవకాశం ఉంటుంది. విద్యార్థులు తాము చేరిన కళాశాల పరిధిలోనే ఖాళీలను బట్టి బ్రాంచి మారేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
{{/usCountry}}ఇప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సు లేదా బ్రాంచిని మార్చుకోవాలనుకుంటే వారికి మరో అవకాశం ఉంటుంది. విద్యార్థులు తాము చేరిన కళాశాల పరిధిలోనే ఖాళీలను బట్టి బ్రాంచి మారేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
{{/usCountry}}ఇక ఈ ప్రధాన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సీట్లు మిగిలిపోతే, వాటిని భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు ) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఇటీవల విడుదలైన తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఎప్పటిలాగే బాలికలు 86.38 శాతంతో పైచేయి సాధించగా…. బాలురు 79.92 శాతం ఉత్తీర్ణత పొందారు.