తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి రోజులతో పోలిస్తే అక్టోబర్ చివరి వారంలో విద్యుత్ పీక్ డిమాండ్, రోజువారీ విద్యుత్ వినియోగం తీవ్రంగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL) డేటా ప్రకారం ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

నివేదిక ప్రకారం సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 మధ్య నమోదైన వినియోగాన్ని, అక్టోబర్ 27 నుండి నవంబర్ 1 మధ్య నమోదైన గణాంకాలతో పోల్చగా రోజువారీ సగటు పీక్ డిమాండ్ 6,355 మెగావాట్ల(MW) నుండి 4,491 మెగావాట్లకు పడిపోయింది. అంటే విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 29.3 శాతం క్షీణత నమోదైంది.
అలాగే సగటు రోజువారీ విద్యుత్ వినియోగం 92.03 మిలియన్ యూనిట్ల నుండి 67.96 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఇది దాదాపు 26.2 శాతం తగ్గుదలగా నమోదైంది.
అక్టోబర్ 27 – నవంబర్ 2 మధ్య విద్యుత్ డిమాండ్, వినియోగం
అక్టోబర్ 27: ఉదయం 7:38 గంటలకు పీక్ డిమాండ్ 5,335 MW కాగా, వినియోగం 76.6426 మిలియన్ యూనిట్లు.
అక్టోబర్ 28: పీక్ డిమాండ్ 4,624 MW, విద్యుత్ వినియోగం 66.5179 మిలియన్ యూనిట్లు.
అక్టోబర్ 29: పీక్ డిమాండ్ పడిపోయి 4,022 MW, వినియోగం 62.769 మిలియన్ యూనిట్లు.
అక్టోబర్ 30: పీక్ డిమాండ్ 4,459 MW, వినియోగం 68.1738 మిలియన్ యూనిట్లు.
అక్టోబర్ 31: పీక్ డిమాండ్ 4,360 MW, వినియోగం 67.522 మిలియన్ యూనిట్లు.
నవంబర్ 1: పీక్ డిమాండ్ 4,147 MW, వినియోగం 66.1128 మిలియన్ యూనిట్లు.
{{/usCountry}}నవంబర్ 1: పీక్ డిమాండ్ 4,147 MW, వినియోగం 66.1128 మిలియన్ యూనిట్లు.
{{/usCountry}}నవంబర్ 2: పీక్ డిమాండ్ 4,181 MW, వినియోగం 63.6162 మిలియన్ యూనిట్లు.
సెప్టెంబర్ 27 – అక్టోబర్ 2 మధ్య గణాంకాలు
సెప్టెంబర్ 27: పీక్ డిమాండ్ 6,008 MW, వినియోగం 99.447 మిలియన్ యూనిట్లు.
సెప్టెంబర్ 28: పీక్ డిమాండ్ 6,594 MW, వినియోగం 98.124 మిలియన్ యూనిట్లు.
సెప్టెంబర్ 29: పీక్ డిమాండ్ 6,442 MW, వినియోగం 85.8551 మిలియన్ యూనిట్లు.
సెప్టెంబర్ 30: పీక్ డిమాండ్ 6,736 MW, వినియోగం 90.0161 మిలియన్ యూనిట్లు.
అక్టోబర్ 1: పీక్ డిమాండ్ 6,069 MW, వినియోగం 87.8109 మిలియన్ యూనిట్లు.
అక్టోబర్ 2: పీక్ డిమాండ్ 6,286 MW, వినియోగం 90.9388 మిలియన్ యూనిట్లు.
తగ్గింపునకు ప్రధాన కారణాలు
వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, వ్యవసాయ అవసరాలు మారడం, పారిశ్రామిక రంగానికి సంబంధించిన కార్యకలాపాల వ్యత్యాసాలు విద్యుత్ డిమాండ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి నాటికి వాతావరణంలో వేడి తగ్గి, చల్లదన వాతావరణం ఏర్పడటం వల్ల ఏసీలు, ఫ్యాన్ల వినియోగం తగ్గడం ఒక కారణం.
వరి తదితర వర్షాకాల పంటల కోతలు పూర్తవ్వడం లేదా చివరి దశకు చేరడంతో అగ్రికల్చర్ పంప్‌సెట్ల వినియోగం తగ్గింది. ఇటీవలి తుపాన్లు, ఉపరితల ఆవర్తనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయ పంపుల వినియోగం క్షీణించింది.
అయితే ఏ రంగంలో వినియోగం ఏ మేరకు తగ్గిందనే దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టిన తర్వాతే ఈ తగ్గింపుకు కచ్చితమైన వివరాలు తెలుస్తాయని టీజీఎన్‌పీడీసీఎల్ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలాఖరులో విద్యుత్ డిమాండ్‌లో చోటుచేసుకున్న ఈ అనూహ్య మార్పు డిస్కంల నిర్వహణపై సానుకూల ప్రభావం చూపనుంది.