...
...
Next Story

తెలంగాణలో 70.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు - ఈసారి కొత్త రికార్డు.. !

ఈ ఖరీఫ్ సీజన్ లో రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యాన్ని సేకరించింది. 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించింది. 14 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు.

Published on: Jan 14, 2026, 06:50:53 IST
Advertisement

2025-26 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 70.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలంగాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కార్యకలాపాల ద్వారా 13.97 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరిందని వివరించారు.

  • రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్‌లో అధిగమించారు.
  • ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం ఉంది.
  • 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించారు.

వరి ధాన్యం సేకరణ
వరి ధాన్యం సేకరణ

సేకరించిన ధాన్యం మొత్తం ఎంఎస్పీ విలువ రూ .16,912 కోట్లకు పైగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రైతులకు రూ .16,602 కోట్లు అందజేశామని చేశామని…. 98 శాతం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందని పేర్కొన్నారు.

రైతులకు అండగా ఉండేందుకు మొత్తం రూ .1,425 కోట్ల బోనస్ చెల్లింపులు అందించబడ్డాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,448 కొనుగోలు కేంద్రాలను తెరవడం ద్వారా ధాన్యం సేకరణ సులభతరమైందని వివరించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల సమన్వయం, తెలంగాణ రైతాంగ భాగస్వామ్యంతోనే ఈ రికార్డు సాధ్యమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇదే మాదిరిగా సమన్వయంతో పని చేసి రైతులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks