...
...
Next Story

హైదరాబాద్‌లో ఇంటి స్థలం కొనాలనుకుంటున్నారా..? బహిరంగ వేలానికి 163 ఓపెన్ ప్లాట్లు, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..!

హైదరాబాద్ శివారులోని తొర్రూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పల్లి, కుర్మల్‌‌‌‌‌‌‌‌గూడ ప్రాంతాల్లో ఉన్న 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం జరగనుంది. ఈ మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ కు నవంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.

Published on: Nov 12, 2025, 07:23:02 IST
Advertisement

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తొర్రూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పల్లి, కుర్మల్‌‌‌‌‌‌‌‌గూడ ప్రాంతాల్లో ఉన్న 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను వివరాలను ప్రకటించింది.

ఈనెల 17,18 తేదీల్లో వేలం…

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం

స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను నవంబర్ 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం ప్రకటించారు.

ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 – నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్ గూడ లో 200-300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200 -1000 గజాల్లోని 13 ప్లాట్లను విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి వివాదాలు లేని, ఈ ప్లాట్లలో తమ అభిరుచులకు అనుగుణంగా ఇండ్లను నిర్మించుకోవచ్చ, ఈ లే అవుట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి అయ్యింది.

ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మేనేజింగ్ డైరక్టర్ వివరించారు. పెద్ద అంబర్ పేట్ లోని అవికా కన్వెన్షన్ లో నవంబరు 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18 వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్ పల్లి, కుర్మల్ గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎండి గౌతమ్ పేర్కొన్నారు.

తొర్రూర్ పై ఫోకస్…!

తొర్రూర్ లే అవుట్ లో ఉన్న885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించారు. మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గృహావసరాల భూములకున్న డిమాండ్ ఉండటంతో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe