Ration Card eKYC : మీ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి అయిందా..? ముగియనున్న గడువు, వెంటనే చేసుకోండి

Telangana Ration Card eKYC : తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులు ఆగస్టు 31 లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గడువు దగ్గరపడిన నేపథ్యంలో వెంటనే ఈ ప్రాసెస్ 

Published on: Aug 27, 2026, 17:04:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Ration Card eKYC : తెలంగాణలో రేషన్ బియ్యం పొందుతున్న కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సౌకర్యం నిరంతరం అందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కేవైసీ పూర్తి చేయడానికి విధించిన గడువు అత్యంత సమీపంలోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ (ఆగస్టు 31) నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఈ గడువును పొడిగించినందున, ఈసారి గడువు లోగా పని పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

రేషన్ కార్డు ఈకేవైసీ
రేషన్ కార్డు ఈకేవైసీ

రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందాలని, అనర్హులు లేదా బోగస్ కార్డుదారులను వ్యవస్థ నుంచి తొలగించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయంలోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈ-కేవైసీ ఎక్కడ చేసుకోవాలి?

లబ్ధిదారులు తమ ఇళ్లకు సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి (FP Shop) వెళ్లడం ద్వారా సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. రేషన్ షాపులో ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్ర వేయడం లేదా ఐరిస్ (కంటిపాప) స్కాన్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ దుకాణాల్లో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.

ఒకవేళ రేషన్ దుకాణాల్లో సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల వీలుకాని పక్షంలో, సమీపంలోని 'మీసేవా' కేంద్రాలకు వెళ్లి కూడా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

మీవద్ద ఉండాల్సిన పత్రాలు…

ఈ-కేవైసీ కోసం వెళ్లేటప్పుడు లబ్ధిదారులు తమ ఒరిజినల్ రేషన్ కార్డును, అలాగే కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. రేషన్ కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడూ ప్రత్యక్షంగా వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఆధార్ డేటాతో ఈ-పోస్ యంత్రంలోని వివరాలను అనుసంధానించి ఈ-కేవైసీని నిర్ధారిస్తారు.

ఈ-కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

మీ రేషన్ కార్డుకు సంబంధించి ఈ-కేవైసీ ఇప్పటికే పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా స్టేటస్ తెలుసుకోవచ్చు.

  • ముందుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ( https://smartpds.telangana.gov.in/ ) ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపించే 'Beneficiary Details' (లబ్ధిదారుల వివరాలు) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్తగా ఓపెన్ అయిన విండోలో మీ రేషన్ కార్డు నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా (Captcha) కోడ్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • స్క్రీన్‌పై మీ కుటుంబ సభ్యుల పేర్ల జాబితాతో పాటు వారి ఈ-కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి.
  • అక్కడ స్టేటస్ 'Active' లేదా 'Verified' అని ఉంటే మీ ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తయినట్లే. ఒకవేళ అలా లేకపోతే వెంటనే రేషన్ షాపునకు వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More