...
...
Next Story

విద్యార్థులలోని వైకల్యాలను గుర్తించేందుకు తెలంగాణలోని పాఠశాలల్లో 'ప్రశస్త్'

విద్యార్థులలోని వైకల్యాలను గుర్తించేందుకు తెలంగాణలోని పాఠశాలల్లో ప్రశస్త్ యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 21 వైకల్యాలను టీచర్లు స్క్రీనింగ్ చేస్తారు.

Published on: Aug 19, 2026, 15:43:44 IST
Advertisement

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రెండు కీలక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ప్రశస్త్(PRASHAST), స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ 2026(SHVR) పేరిట చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థులలోని వైకల్యాలను గుర్తించేందుకు తెలంగాణలోని పాఠశాలల్లో 'ప్రశస్త్'
విద్యార్థులలోని వైకల్యాలను గుర్తించేందుకు తెలంగాణలోని పాఠశాలల్లో 'ప్రశస్త్'

ప్రశస్త్ యాప్ ద్వారా దివ్యాంగత్వ గుర్తిస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో వైకల్యాల ముందస్తు సంకేతాలను గుర్తించనున్నారు. యూడైస్ ప్లస్‌లో ఉన్న దాదాపు 3.65 లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ యాప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. NCERT/CIET అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా దివ్యాంగుల హక్కుల చట్టం-2016(RPwD Act) గుర్తించిన 21 రకాల వైకల్యాల లక్షణాలను ఉపాధ్యాయులు గుర్తిస్తారు.

ఉపాధ్యాయులందరూ ప్రశస్త్ యాప్ లేదా పోర్టల్ ద్వారా ఆగస్టు 31 లోపు అవగాహన మాడ్యూల్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా రెగ్యులర్ టీచర్లు పిల్లల ప్రవర్తన, శారీరక లక్షణాలను స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైన చోట స్పెషల్ ఎడ్యుకేటర్లు దీనిని ధృవీకరిస్తారు. ఇది వైద్యపరమైన రోగనిర్ధారణ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రాథమిక గుర్తింపు వ్యవస్థ మాత్రమేనని తెలిపింగది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనంపై స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్యం, పర్యావరణ పద్ధతులను మెరుగుపరిచేందుకు ఈ మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టారు.

ఈ రెండు కార్యక్రమాల సమర్థవంతమైన అమలు ద్వారా బడిపిల్లల్లో ఉన్న శారీరక, మానసిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి తగిన ఉపశమనం అందించడంతో పాటు, బడుల్లో మెరుగైన పరిశుభ్రత, హరిత వాతావరణం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks