...
...
Next Story

ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published on: Dec 14, 2025, 14:25:19 IST
Advertisement

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోరు ముగిసింది. రెండో దశలో 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీలకు, 29911 వార్డు మెంబర్ల కోసం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటలకు ఓట్లు లెక్కింపు మెుదలుపెట్టారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా సుమారు 57 లక్షల 22 వేలకుపైగా ఓటర్లు పాల్గొన్నారు.

రెండో విడత పంచాయతీ ఎన్నికలు
రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఆదివారం కావడంతో ఊర్లలో కూడా సందడి నెలకొంది. పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఓటు వేసేందుకు తరలివచ్చారు. 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 57 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ జరిగింది.

ఎన్నికల ప్రశాంతంగా జరిగినప్పటికీ కొన్ని ప్రదేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్ జిల్లాలోని కొనాయిపల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య మెుదలైన వాగ్వాదం.. తోపులాటకు దారితీసింది.

మెుదక్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. నర్సంపల్లి పెద్దతండా పంచాయతీ సర్పంచ్ పదవికి శంకర్ నాయక్ భార్య పోటీ చేశారు. అయితే ప్రత్యర్థులు ఓటుకు రూ.2వేలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. సర్పంచ్ పదవికి పోటీ చేసి గతంలో ఓడిపోయానని, డబ్బులు పంచి ప్రత్యర్థులు ఎన్నికల్లో నెగ్గుతున్నారని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అవంచలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. పరస్పర దాడులు కూడా జరిగాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe