95 ఏండ్ల వయసులో సర్పంచ్‌ - విజయం సాధించిన మాజీ మంత్రి తండ్రి..!

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన  విజయం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి(95) సర్పంచ్ గా గెలిచారు. 95 ఏళ్ల ఈ వయసులో పోటీలో నిలబడి విజయం సాధించటంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Published on: Dec 12, 2025, 11:00:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ గా విజయం సాధించారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోరులో రామచంద్రారెడ్డి విక్టరీని అందుకున్నారు.

గుంటకండ్ల రామచంద్రారెడ్డి
గుంటకండ్ల రామచంద్రారెడ్డి

రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన కుమారుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా చురుకుగా వ్యవహారించారు. మరోవైపు అధికార కాంగ్రెస్ లోని కీలక నేతలు… ఇక్కడ హస్తం పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓ రకంగా ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడించి… జగదీశ్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాలని భావించారు. కానీ చివరగా రామచంద్రారెడ్డే విజయం సాధించటంతో… బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

కేసీఆర్ అభినందనలు…

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. నిజానికి 95 సంవత్సరాల వయసులో ఉన్న రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారన్న విషయం తెలిసి కేసీఆర్ కొంత ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు.

“100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం అరుదు. ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం… అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం” అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్… వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, మద్దతుగా నిలిచిన బి ఆర్ ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలషించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More