...
...
Next Story

TG SI Exam Hall Ticket 2026 : తెలంగాణ ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana SI Exam Hall Ticket 2026 : తెలంగాణలో 275 ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. నవంబర్ 29న పరీక్ష జరగనుండగా, నవంబర్ 28 వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Nov 25, 2026, 10:21:34 IST
Advertisement

తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను నవంబర్ 28, 2026 వరకు ఆన్‌లైన్‌లో డౌన్లోడ చేసుకోవచ్చు.

ఎస్సై హాల్ టికెట్లు విడుదల
ఎస్సై హాల్ టికెట్లు విడుదల

రాష్ట్రవ్యాప్తంగా 275 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా…. పోటీ పరీక్షకు సుమారు 1.60 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థులందరికీ నవంబర్ 29, 2026న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. నవంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు గంటల పాటు పరీక్ష సాగుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

ముఖ్య వివరాలు :

పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)

మొత్తం పోస్టులు: 275

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చివరి తేదీ: నవంబర్ 28, 2026

పరీక్ష తేదీ: నవంబర్ 29, 2026

పరీక్ష సమయం: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు

హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి…?

  1. ముందుగా TSLPRB అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in/ లోకి వెళ్లాలి.
  2. హోమ్‌పేజీలో కనిపించే 'SI Preliminary Hall Ticket 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి.
  4. స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
  5. హాల్ టికెట్‌లో మీ పేరు, ఫొటో, పరీక్ష కేంద్రం చిరునామా, సమయం వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks