Telangana Special TET Notification 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టీజీటెట్-2026 (TGTET-In-service Teachers-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం ఇదే తొలిసారి. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని, సెప్టెంబరు 2028 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే రెండు సాధారణ టెట్‌లతో పాటు ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, లోకల్ బాడీ, టీజీఆర్‌ఈఐఎస్ (TGREIS), మోడల్ స్కూళ్లు, వెల్ఫేర్ సొసైటీ పాఠశాలల్లో దాదాపు 20 వేల మంది వరకు ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి కావడంతో డిజిగ్నేషన్, సర్వీస్ పదోన్నతులు ఆశిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోనున్నారు.
పరీక్షల షెడ్యూల్
- దరఖాస్తుల సమర్పణ: జులై 22 నుంచి జులై 29 వరకు
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఆగస్టు 31 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
- పరీక్ష తేదీలు: సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 11 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
- ఉదయం సెషన్: 9.00 AM నుంచి 11.30 AM వరకు మధ్యాహ్నం సెషన్: 2.00 PM నుంచి 4.30 PM వరకు
- ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 28 నుంచి 30 మధ్య ఫలితాలను ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్‌సైట్ ( https://schooledu.telangana.gov.in ) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. ఎస్జీటీలుగా పనిచేస్తూ బీఈడీ విద్యార్హత ఉండి, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు.
{{/usCountry}}ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. ఎస్జీటీలుగా పనిచేస్తూ బీఈడీ విద్యార్హత ఉండి, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు.
{{/usCountry}}