TG Special TET Notification 2026 : ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - నేటి నుంచే దరఖాస్తులు, పూర్తి షెడ్యూల్

Telangana Special TET Notification 2026 : తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ తొలిసారిగా ప్రత్యేక ఇన్-సర్వీస్ టెట్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి 11 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు.

Published on: Jul 22, 2026, 06:50:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Special TET Notification 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టీజీటెట్-2026 (TGTET-In-service Teachers-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం ఇదే తొలిసారి. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌
టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌

ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని, సెప్టెంబరు 2028 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే రెండు సాధారణ టెట్‌లతో పాటు ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది.

రాష్ట్రంలో ప్రభుత్వ, లోకల్ బాడీ, టీజీఆర్‌ఈఐఎస్ (TGREIS), మోడల్ స్కూళ్లు, వెల్ఫేర్ సొసైటీ పాఠశాలల్లో దాదాపు 20 వేల మంది వరకు ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి కావడంతో డిజిగ్నేషన్, సర్వీస్ పదోన్నతులు ఆశిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోనున్నారు.

పరీక్షల షెడ్యూల్

  • దరఖాస్తుల సమర్పణ: జులై 22 నుంచి జులై 29 వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఆగస్టు 31 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
  • పరీక్ష తేదీలు: సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 11 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
  • ఉదయం సెషన్: 9.00 AM నుంచి 11.30 AM వరకు మధ్యాహ్నం సెషన్: 2.00 PM నుంచి 4.30 PM వరకు
  • ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 28 నుంచి 30 మధ్య ఫలితాలను ప్రకటిస్తారు.
  • అధికారిక వెబ్‌సైట్ ( https://schooledu.telangana.gov.in ) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. ఎస్‌జీటీలుగా పనిచేస్తూ బీఈడీ విద్యార్హత ఉండి, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More