తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి(SSC), ఓఎస్‌ఎస్‌సీ (OSSC), ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా రుసుము చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం పత్రికా ప్రకటన ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో తప్పిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను చూడండి. ఫైన్ లేకుండా 30-10-2026 నుండి 16-11-2026 వరకు ఫీజు చెల్లించవచ్చు. హెడ్‌మాస్టర్ల ద్వారా సైబర్ ట్రెజరీకి ఫీజు చేయాల్సిన తేదీలు 04-11-2026 నుండి 17-11-2026 వరకు అవకాశం ఇచ్చారు.
రూ. 50 ఆలస్య రుసుముతో 18-11-2026 నుండి 01-12-2026 వరకు చెల్లించవచ్చు. రూ. 200 ఆలస్య రుసుముతో 03-12-2026 నుండి 14-12-2026 వరకు పరీక్షల ఫీజు చెల్లించాలి. రూ. 500 ఫైన్‌తో 16-12-2026 నుండి 28-12-2026 వరకు ఫీజు చెల్లించవచ్చు.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు లేట్ ఫీ లేకుండా అన్ని సబ్జెక్టులకు రూ. 125 చెల్లించాలి. బ్యాక్‌లాగ్ విద్యార్థులకు మూడు సబ్జెక్టుల వరకు రూ. 110, మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉంటే రూ. 125 చెల్లించాలి. ఒకేషనల్ అభ్యర్థులకు సాధారణ SSC అకడమిక్ పరీక్షల రుసుము రూ. 125కి అదనంగా మరో రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు పరీక్షా రుసుము నుండి మినహాయింపు ఉంటుంది.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. పరీక్షా రుసుము చెల్లింపుల గడువు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేశారు. ఫీజు చెల్లింపు ప్రక్రియ అంతా సైబర్ ట్రెజరీ ద్వారా www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోని స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి.
{{/usCountry}}పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. పరీక్షా రుసుము చెల్లింపుల గడువు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేశారు. ఫీజు చెల్లింపు ప్రక్రియ అంతా సైబర్ ట్రెజరీ ద్వారా www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోని స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి.
{{/usCountry}}IFMIS పోర్టల్ చలానాలు లేదా మ్యాన్యువల్ బ్యాంక్ చలానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఫీజు జమ చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
HM/పాఠశాల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. అభ్యర్థులు లేదా హెడ్‌మాస్టర్లు ఇతర వివరాల కోసం తమ సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు. లేదా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.