తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి వెల్లడించారు. క్యూర్, ప్యూర్, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.
- మొత్తం బడ్జెట్ : రూ.3,24,234 కోట్లు
- రెవెన్యూ వ్యయం : రూ.2,34,406 కోట్లు
- మూలధన వ్యయం : రూ.47,267 కోట్లు
బడ్జెట్ ముఖ్యాంశాలు

తెలంగాణ బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు ఇదే అత్యధిక కేటాయింపులు. 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కానుంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించింది ప్రభుత్వం. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం లభించనుంది. రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన చేసింది.
- వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
- పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
- విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
- వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
- కార్మిక శాఖకు రూ.998 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
- పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
- ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
- బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
- మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
- పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు
- మూసి రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు
- CURE ఏరియా అభివృద్ధికి రూ.2,654 కోట్లు
- ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు
- ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు రూ.1,056 కోట్లు
- ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,500 కోట్లు
- పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు
- హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు
- రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
- పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
- బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు
- కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు
- విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
- స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు
- తప్పనిసరి కార్యాలయ ఖర్చులు రూ.2,323 కోట్లు
- రైతు భరోసాకు రూ.18,000 కోట్లు
- చేయూతకు రూ.14,861 కోట్లు
- ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు
- మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు
- సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు
- గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
- రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.1,143 కోట్లు
- మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ రూ.723 కోట్లు
- శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు
- గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు
- పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు
- రాజీవ్ యువ వికాసం - రూ.6వేల కోట్లు
- గృహ నిర్మాణం - రూ.7,430 కోట్లు
- ఐటీ రంగం - రూ.875 కోట్లు
- పరిశ్రమలు - రూ.3,490 కోట్లు
- చేనేత - రూ.258 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.33,688 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులు - రూ.22,615 కోట్లు
- రవాణా శాఖ - రూ.12,759 కోట్లు
- న్యాయ శాఖ - రూ.2,367 కోట్లు
- పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ - రూ.17,907కోట్లు
- రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు
- సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు
- పశుసంవర్ధక శాఖ - రూ.1,529 కోట్లు
- విద్యుత్ - రూ.21,285 కోట్లు
- విద్యా శాఖ - రూ.26,674 కోట్లు
- వైద్యం - రూ.13,679కోట్లు
- కార్మికుల సంక్షేమం - రూ.999 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం - రూ.3,143 కోట్లు
- ఎస్సీ సంక్షేమం - రూ.11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమం - రూ.7,937కోట్లు
- బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు
- మైనారిటీ సంక్షేమం - రూ.3,769 కోట్లు