...
...
Next Story

TG TET 2026 Hall Ticket : తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG TET Hall Ticket 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jun 09, 2026 12:21 PM IST
Advertisement

తెలంగాణ టెట్ కు సిద్ధమవుతున్న టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీ టెట్ 2026 హాల్ టికెట్ - ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..?

  1. ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని టీజీ టెట్ హాల్ టికెట్ (జూన్ 2026) లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఆధార్ నెంబర్, జర్నల్ నెంబర్, మొబైల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  6. పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

జూన్ 16 నుంచి టెట్ పరీక్షలు

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) విధానంలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై ఉన్న అభ్యర్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే టెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించి సరిచేసుకోవాల్సి ఉంటుంది.

  • టెట్ పరీక్షలను మొత్తం 10 సెషన్లలో, 5 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
  • మొదటి షిఫ్ట్ (షిఫ్ట్ I) ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో షిఫ్ట్ (షిఫ్ట్ II) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతుంది.
  • ఈ విడత టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్ I కోసం 32,779 మంది అభ్యర్థులు, పేపర్ II కోసం 86,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు (పేపర్ I మరియు పేపర్ II) కలిపి 17,334 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
  • డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్ష అభ్యర్థులకు అత్యంత కీలకం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe