తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ పరీక్షలను జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతాయని అధికారులు ప్రకటించారు. రెండు సెషన్లలో టెట్ పరీక్షలు ఉంటాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బొధించేవారికి పేపర్ 1 పరీక్ష, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బొధించేవారికి పేపర్ 2 ఉంటుంది.
జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జనగాం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ అభ్యర్థులకు నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, నారాయణపేట అభ్యర్థులకు ఉంటుంది.
జనవరి 4న మొదటి సెషన్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : మంచిర్యాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, వరంగల్, జగిత్యాల వారికి ఉంటుంది.
జనవరి 5న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, పెద్దపల్లి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్ : కరీంనగర్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగువారికి నిర్వహిస్తారు.
{{/usCountry}}జనవరి 5న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, పెద్దపల్లి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్ : కరీంనగర్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగువారికి నిర్వహిస్తారు.
{{/usCountry}}జనవరి 6న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 : నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, ఇతరాలు, నిజామాబాద్. రెండో సెషన్ : యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, వనపర్తి, సిద్దిపేట, సూర్యాపేట అభ్యర్థులకు ఉంటుంది.
జనవరి 8న మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి. రెండో సెషన్ : హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి వారికి నిర్వహిస్తారు.
జనవరి 9న మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : వికారాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్.
జనవరి 11 మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, జగిత్యాల అభ్యర్థులకు ఉండగా.. రెండో సెషన్ : మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జనగాం, నిర్మల్, జోగులాంబ గద్వాల్ అభ్యర్థులకు ఉంటుంది.
ఇక జనవరి 19వ తేదీన మెుదటి సెషన్‌లో పేపర్ 1(మైనర్) పరీక్ష.. అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ మీడియంలో వారికి ఉంటుంది. జనవరి 20వ తేదీన మెుదటి సెషన్ పేపర్ 2(మైనర్) పరీక్ష మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు జరుగుతుంది.