ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, అటవీ ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న కీలకమైన ద్వైపాక్షిక చర్చలకు పూర్తిస్థాయి సాంకేతిక ఆధారాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ నెల 23వ తేదీ తర్వాత ప్రాజెక్టు చర్చల నిమిత్తం ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో పాటు ఇరిగేషన్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చలు…
సమీక్షలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీటి తరలింపు సాధ్యాసాధ్యాలు, ముంపు ప్రభావంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.
152 మీటర్ల ఎత్తున బ్యారేజీని నిర్మిస్తే సుమారు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని అధికారుల అంచనా. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ముంపు ప్రభావం 1,000 ఎకరాల లోపే ఉంటుందని విశ్లేషించారు.
గతంలో 148 మీటర్ల ఎత్తుకే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ… అంత తక్కువ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణకు ఆశించిన స్థాయిలో నీరు లభించదని సీఎం గుర్తుచేశారు. అందుకే 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించేలా నీటి లభ్యత, సాంకేతిక నివేదికలు, ముంపు అంచనాలతో కూడిన పక్కా వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) వద్ద జరిగిన సమావేశాల నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. 'జల్, జంగిల్, జమీన్' నినాదంతో పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు.
{{/usCountry}}ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) వద్ద జరిగిన సమావేశాల నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. 'జల్, జంగిల్, జమీన్' నినాదంతో పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు.
{{/usCountry}}ఇదే సమావేశంలో సుదీర్ఘకాలంగా పీఠముడిగా మారిన డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల నీటి కేటాయింపులపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. డిండి ప్రాజెక్టు (DLIS) కోసం ఏదుల రిజర్వాయర్ నుండి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల చొప్పున మొత్తం 0.6 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ అదనపు 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుండి సేకరించి……. నార్లాపూర్ మీదుగా ఏదుల రిజర్వాయర్‌కు తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు.
పంప్‌హౌస్‌ల ఏర్పాటు, ప్రస్తుత కాల్వలు, సొరంగాల సామర్థ్యం పెంపుపై తక్షణమే అధ్యయనం జరిపి నూతన డిజైన్లు సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపులకు ఎలాంటి కోత పడకుండా, అదనపు నీటిని మాత్రమే ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లించేలా మధ్యేమార్గాన్ని సీఎం ప్రతిపాదించగా…. సమావేశంలో ఉన్న మంత్రులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.