తెలంగాణలో హోమ్ స్టే పెట్టాలనుకుంటున్నారా? వెంటనే అప్లై చేయండి!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సౌకర్యవంతమైన, ప్రపంచ స్థాయి హోమ్‌స్టే వసతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగా 'తెలంగాణ టూరిజం హోమ్ స్టే' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
పర్యాటకులకు సౌకర్యవంతమైన వసతి కల్పించడానికి, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను అనుభవించడంలో టూరిస్టులకు సహాయపడటానికి తెలంగాణ ప్రభుత్వం హోమ్ స్టేలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా టూరిస్టులతో తెలంగాణ వంటకాలను కూడా ఆస్వాదించేలా చేయనుంది. తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలను ప్రపంచ స్థాయి టూరిస్టులకు పరిచయం చేయనుంది. అంతేకాదు ఈ హోమ్ స్టేల ద్వారా స్థానికులకు ఉపాధి దొరకనుంది.

ఈ హోమ్ స్టేలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడిదారులు, వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిని రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. సిల్వర్ కేటగిరీకి రూ.2,000, గోల్డ్ కేటగిరీకి రూ.4,000గా ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్ డ్రాఫ్ట్‌లను 'కమిషనర్/డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్' అనే చిరునామాకు చెల్లించాలి.
ఆసక్తి ఉన్న వ్యక్తులు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్, మార్గదర్శకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హైదరాదాబ్ రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న పర్యాటకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయి. మరిన్ని వివరాల కోసం, దరఖాస్తుదారులు డిపార్ట్‌మెంట్‌ను 040-23459282 నంబర్‌లో లేదా director.telanganatourism@gmail.com, telanganatourismpub@gmail.com ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
పర్యాటకులకు సౌకర్యవంతమైన వసతిని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హోమ్‌స్టే సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ ప్రైవేట్ పెట్టుబడిదారులు, వ్యక్తుల నుండి ఈ దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా ప్రధాన కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో శుభ్రమైన, సరసమైన బస దొరికేలా చేయడం ఈ కాన్సెప్ట్ లక్ష్యం.
ఈ చొరవలో భాగంగా హోమ్ స్టేలను 'తెలంగాణ టూరిజం హోమ్‌స్టే ఎస్టాబ్లిష్‌మెంట్స్'గా వర్గీకరిస్తారు. విదేశీ, దేశీయ పర్యాటకులకు సౌకర్యవంతమైన బసను అందిస్తారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, తెలంగాణ వంటకాలను రుచి చూసేలా చేస్తారు.
మార్గదర్శకాలు, దరఖాస్తు ఫారాలను హైదరాబాద్‌లోని శాఖ కార్యాలయం నుండి లేదా www.tourism.telangana.gov.in లో ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పర్యాటక శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


