TG Govt Study Circle : బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్నారా..? మీకోసమే ఫ్రీ కోచింగ్, వివరాలివిగో

Telangana Tribal Study Circle Free Coaching : ఐబీపీఎస్ బ్యాంకు పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ శుభవార్త చెప్పింది. 75 రోజుల ఉచిత శిక్షణను ప్రకటించింది.  అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు మే 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Apr 26, 2026, 21:02:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకు రంగంలో స్థిరపడాలని కలలు కనే నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీపీఎస్ (IBPS) నిర్వహించే వివిధ బ్యాంకు ఉద్యోగాల భర్తీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థుల కోసం తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి... వారిని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్నారా..? మీకోసమే ఫ్రీ కోచింగ్
బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్నారా..? మీకోసమే ఫ్రీ కోచింగ్

75 రోజుల ప్రత్యేక శిక్షణ….

హైదరాబాద్‌లోని పీఈటీసీ (PETC) శిక్షణ కేంద్రం వేదికగా ఈ శిక్షణా కార్యక్రమం సాగనుంది. మొత్తం 75 రోజుల పాటు సాగే ఈ కోర్సులో నిపుణులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తారు. మే 20వ తేదీ నుంచి ఈ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు చెల్లించలేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ ఒక గొప్ప అవకాశంగా మారనుంది.

ఈ శిక్షణా కార్యక్రమం కోసం మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వివిధ వర్గాల వారికి రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయించారు:

  • ఎస్టీ (ST) అభ్యర్థులు: 75 సీట్లు
  • ఎస్సీ (SC) అభ్యర్థులు: 15 సీట్లు
  • బీసీ (BC) అభ్యర్థులు: 10 సీట్లు

ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షలకు మించకూడదని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వం నిర్ణయించిన ఇతర విద్యార్హతలను కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువతకు ప్రాధాన్యత కల్పించేలా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

  • ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 28, 2026
  • చివరి తేదీ: మే 7, 2026

అభ్యర్థులు https://studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలను నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు కార్యాలయ పనివేళల్లో 040-27540104 నంబరును సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. బ్యాంకు కొలువు సాధించాలనే పట్టుదల ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More