వికసిత్ భారత్‌కు అనుగుణంగా తెలంగాణ దార్శనికత : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా మారాలనే తెలంగాణ దార్శనికత.. వికసిత్ భారత్‌కు అనుగుణంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇది దేశ మొత్తం వృద్ధికి గణనీయంగా దోహదపడుతుందన్నారు.

Published on: Jan 26, 2026, 11:24:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందన్నారు. ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా మారాలనే తెలంగాణ దార్శనికత.. వికసిత్ భారత్‌కు అనుగుణంగా ఉందన్నారు గవర్నర్.

రిపబ్లిక్ డే వేడుకలు
రిపబ్లిక్ డే వేడుకలు

'2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవాలని వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పత్రాన్ని గత ఏడాది డిసెంబరులో ప్రపంచ నాయకులు, పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్కరించారు. విజన్ 2047 డాక్యుమెంట్‌లో మూడు జోన్‌లు ఉన్నాయి. క్యూర్, ప్యూర్, రేర్. 2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని వికసిత్ భారత్ భావిస్తోంది. ఈ జాతీయ దృక్పథానికి అనుగుణంగా తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇది దేశ మొత్తం వృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది. ఈ ఆకాంక్షను సాధించడానికి తెలంగాణ రైజింగ్ - విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించారు.' అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు.

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా మేడారం జాతరలో మంత్రివర్గ సమావేశం జరిగిందని, ఆదివాసి ఉత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని గవర్నర్ చెప్పారు. మేడారం అభివృద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించినట్టుగా తెలిపారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాయన్నారు. 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్టుగా చెప్పారు. ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1780 కోట్లు అందజేశామన్నారు.

'భూ వివాదాలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టం తీసుకొచ్చాం. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఇప్పటివరకు 62 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం.' అని గవర్నర్ వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More