రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గడువు ఓసారి గడువు కూడా పొడిగించింది. అయితే ఇవాళ్టితో ఆ గడువు కూడా పూర్తి కానుంది. చివరి రోజు కావటంతో… ఇవాళ కూడా కాస్త అధిక సంఖ్య అప్లికేషన్లు రావొచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త వైన్స్ టెండర్ల కోసం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అయితే అనుకున్నంతగా స్పందన లేకపోవటంతో… ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతూ వచ్చింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా…. బుధవారం(అక్టోబర్ 22) 90 వేలు దాటాయి.
ఇక గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా… ఈసారి అనుకున్నంత స్థాయిలో మాత్రం స్పందన కనిపించలేదు.దరఖాస్తు ఫీజు(రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు) పెంపు నిర్ణయం దరఖాస్తులపై పడినట్లు కనిపిస్తోంది.
దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్ 27న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.
కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు… డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గత నెల 25వ తేదీనే డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గత నెల 25వ తేదీనే డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}