అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. మద్యం లో పురుగుల మందు కలిపి తాగించి దారుణంగా హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన భార్యతో పాటు ఆమె ప్రియుడు…. సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండేల సంపత్ (32) ప్లంబింగ్ పనులు చేస్తూ, ప్రస్తుతం బుద్ధారం గ్రామంలో నివాసముంటున్నాడు. సెప్టెంబర్ 17న రాత్రి బుద్ధారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణ సమీపంలో సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. సెప్టెంబర్ 18న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఘన్‌పూర్ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
అక్రమ సంబంధమే కొంపముంచింది…..
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంపత్ భార్య పెండేల సుమలత (26)కు అదే గ్రామానికి చెందిన ఉమ్మళ్ల శ్రీకాంత్ (36) అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయమై భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంపత్, శ్రీకాంత్‌ను పలుమార్లు తీవ్రంగా హెచ్చరించాడు. తమ బంధానికి సంపత్ అడ్డుగా మారాడని భావించిన శ్రీకాంత్, సుమలత కలిసి అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. ఈ ప్లాన్ అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన పోలుదాసరి తరుణ్ (23) అనే యువకుడికి రూ. 1 లక్ష ఇస్తామని ఎర వేసి తమతో చేర్చుకున్నారు.
సెప్టెంబర్ 17న శ్రీకాంత్, తరుణ్‌లు కలిసి సంపత్‌ను బుద్ధారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణానికి తీసుకెళ్లారు. అక్కడ అతడితో మద్యం తాగిస్తూ, అందులో ముందే తెచ్చిన పురుగుల మందును కలిపారు. అది తాగిన సంపత్ అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు.
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్ర….
హత్య జరిగిన తర్వాత దీనిని ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితులు డ్రామా ఆడారు. శ్రీకాంత్‌కు చెందిన పల్సర్ మోటార్ సైకిల్ (TS-03-EF-4082) పై సంపత్ మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేయడానికి సంపత్ నోటిలో, బట్టలపై మరియు ఇంట్లోని నేలపై పురుగుల మందును పోశారు.
{{/usCountry}}హత్య జరిగిన తర్వాత దీనిని ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితులు డ్రామా ఆడారు. శ్రీకాంత్‌కు చెందిన పల్సర్ మోటార్ సైకిల్ (TS-03-EF-4082) పై సంపత్ మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేయడానికి సంపత్ నోటిలో, బట్టలపై మరియు ఇంట్లోని నేలపై పురుగుల మందును పోశారు.
{{/usCountry}}అయితే పోలీసుల దర్యాప్తులో ఈ నాటకం బయటపడింది. ఘటనా స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఫొటోలు, వీడియోలు సేకరించారు. పంచనామా నిర్వహించి, సాక్షులను విచారించడంతో పాటు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యగా నిర్ధారించారు. దీంతో కేసును భారతీయ నస్య సంహిత (BNS) సెక్షన్లు 61(2), 103 తో పాటు 3(5) కింద మార్చారు.
నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్, ముగ్గురి మొబైల్ ఫోన్లు, తరుణ్ వద్ద ఉన్న రూ. 500 నగదు, పురుగుల మందు కలిపిన సగం మద్యం సీసా, విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
"ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులు సుమలత, శ్రీకాంత్, తరుణ్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాం. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది," అని ఘన్‌పూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (CI) వెల్లడించారు. ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తును వేగవంతం చేశామని ఆయన తెలిపారు.