ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా నిలవాలని అమెరికా వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి అక్కడ ఆకస్మికంగా మరణించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల అమెరికాలో కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన స్థానిక బంధువులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అరుణ్ సాయి రెడ్డి చిత్రంతో కూడిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అరుణ్ సాయి రెడ్డి తన చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో STEM OPT (Science, Technology, Engineering, and Math Optional Practical Training) కాలపరిమితిలో ఉన్నాడు. తన స్వగ్రామం మహబూబ్‌నగర్ నుండి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఆయన, తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించేవాడు. ప్రస్తుతం ఆయన అక్కడ ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్న తరుణంలో ఈ ఘోరం జరిగిపోయింది. అనారోగ్యంతో సాయి రెడ్డి మరణించారు.
ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ ఉద్యోగం కోసం చూస్తున్న అరుణ్ సాయికి ఇలా జరిగింది. అతడి అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. అరుణ్ సాయి రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నకొడుకు ఇక లేడనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ కష్టసమయంలో అరుణ్ భౌతిక కాయాన్ని భారతదేశానికి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు, బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రవాస భారతీయులు ఒక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయ, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఒత్తిడి, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. STEM OPT కాలంలో ఉద్యోగ అన్వేషణ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడకు వెళ్లినవారు అమెరికాలోని స్థానిక తెలుగు సంఘాలు, భారత ఎంబసీ, స్నేహితులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండటం అత్యవసరం.
{{/usCountry}}ఇటీవలి కాలంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయ, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఒత్తిడి, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. STEM OPT కాలంలో ఉద్యోగ అన్వేషణ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడకు వెళ్లినవారు అమెరికాలోని స్థానిక తెలుగు సంఘాలు, భారత ఎంబసీ, స్నేహితులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండటం అత్యవసరం.
{{/usCountry}}