జర్మనీలో జరిగిన ఒక అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడు. మృతుడిని జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిన్ రెడ్డిగా గుర్తించారు. హృతిన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్లాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి.

మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో, హృతిన్ భవనంపై నుండి దూకడంతో తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినప్పటికీ, పరిస్థితి మరింత దిగజారి గాయాలతో హృతిన్ రెడ్డి మరణించాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, సంఘటన కచ్చితమైన పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కామారెడ్డిలో వ్యక్తి మృతి
కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు రాష్ట్రంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో పోలీసులను చూసిన ఓ వ్యక్తి.. ఆపకుండా కారు వేగంగా పోనిచ్చి మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డిలో గురువారం జరిగింది. కలెక్టక్ కార్యాలయం సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే మార్గంలో వెళ్తున్న గోపు నరేశ్ పోలీసులను చూశాడు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా.. కారును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.
కారు స్పీడుగా వెళ్లి బండరాయిని బలంగా ఢీ కొట్టింది. ఈ కారణంగా కారు బోల్తా కొట్టింది. గోపు నరేశ్ ఘటన స్థలంలోనే మరణించాడు. ఘటన జరిగిన వెంటనే.. పోలీసులు అతడిని బయటకు తీశారు. కానీ అప్పటికే మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం.. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిది రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌గా గుర్తించారు.
బిర్యానీ తిని మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొన్నది. బిర్యానీ తిని ఒకరు మృతి చెందారు. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా 17 మంది మద్యం సేవించి చారు. అయితే బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయాడు. మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొన్నది. బిర్యానీ తిని ఒకరు మృతి చెందారు. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా 17 మంది మద్యం సేవించి చారు. అయితే బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయాడు. మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}