తెలంగాణలో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్యపరమైన నిర్వహణకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశాలు జరిగాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ వినియోగం పరంగా దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో, మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా నిర్వహణ అత్యంత కీలకంగా మారింది.

తెలంగాణలో ఈవీల వాడకం పెంచేందుకు TGREDCO చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు చూస్తోంది. మొత్తం 369 ఛార్జింగ్ స్టేషన్లలో 200 స్టేషన్లు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉంటాయి. మిగిలిన 169 స్టేషన్లు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఛార్జింగ్ కోసం ధరను యూనిట్‌కు రూ.13 (అదనంగా GST)గా నిర్ణయించారు. ఒప్పంద కాలం అంతటా వినియోగదారులకు ఇదే ధర వర్తిస్తుందని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ 'తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్'(TG REDCO) చేపట్టిన చొరవలో భాగంగా ఉంది. దీని కింద ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల(CPOలు) నుండి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. TG REDCO ద్వారా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని అభివృద్ధి చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్యపరమైన బాధ్యతలను ఎంపికైన సీపీఓలు చూసుకుంటారు. ఈ ఒప్పంద కాలం 10 ఏళ్లు ఉంటుంది. పట్టణ పరిధిలోని ఛార్జర్లు కనీసం 95శాతం సమయం పనిచేసేలా (అప్‌టైమ్) చూసేందుకు తగిన నిబంధనలు రూపొందించారు.
TGNPDCL పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 169 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల విషయంలో సర్వే, డిజైన్, సరఫరా, సివిల్ పనులు, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్‌తో పాటు 10 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను సీపీఓలే చేపడతారు. అర్హులైన బిడ్డర్లకు PM E-DRIVE పథకం కింద, వర్తించే నిబంధనలకు లోబడి సబ్సిడీ కూడా లభిస్తుంది.
{{/usCountry}}TGNPDCL పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 169 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల విషయంలో సర్వే, డిజైన్, సరఫరా, సివిల్ పనులు, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్‌తో పాటు 10 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను సీపీఓలే చేపడతారు. అర్హులైన బిడ్డర్లకు PM E-DRIVE పథకం కింద, వర్తించే నిబంధనలకు లోబడి సబ్సిడీ కూడా లభిస్తుంది.
{{/usCountry}}రాష్ట్రానికి వ్యూహాత్మక భౌగోళిక ప్రాముఖ్యత ఉందని TG REDCO వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. అనేక జాతీయ రహదారులు, ప్రధాన రవాణా కారిడార్లు రాష్ట్రం గుండా వెళుతుండటంతో ఎక్కువ మెుత్తంలో అంతర్-రాష్ట్ర ప్రయాణం, సరుకు రవాణా జరుగుతోందని తెలిపారు.