తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు.. ఛార్జింగ్ ధర యూనిట్‌కు రూ.13 ఫిక్స్

EV Charging Stations : తెలంగాణలో 369 ఈవీ (EV) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు. ఛార్జింగ్ ధర యూనిట్‌కు రూ.13గా నిర్ణయించారు.

Published on: Sep 8, 2026, 09:43:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్యపరమైన నిర్వహణకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశాలు జరిగాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ వినియోగం పరంగా దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో, మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా నిర్వహణ అత్యంత కీలకంగా మారింది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్
ఈవీ ఛార్జింగ్ స్టేషన్

తెలంగాణలో ఈవీల వాడకం పెంచేందుకు TGREDCO చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు చూస్తోంది. మొత్తం 369 ఛార్జింగ్ స్టేషన్లలో 200 స్టేషన్లు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉంటాయి. మిగిలిన 169 స్టేషన్లు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఛార్జింగ్ కోసం ధరను యూనిట్‌కు రూ.13 (అదనంగా GST)గా నిర్ణయించారు. ఒప్పంద కాలం అంతటా వినియోగదారులకు ఇదే ధర వర్తిస్తుందని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ 'తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్'(TG REDCO) చేపట్టిన చొరవలో భాగంగా ఉంది. దీని కింద ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల(CPOలు) నుండి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. TG REDCO ద్వారా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని అభివృద్ధి చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్యపరమైన బాధ్యతలను ఎంపికైన సీపీఓలు చూసుకుంటారు. ఈ ఒప్పంద కాలం 10 ఏళ్లు ఉంటుంది. పట్టణ పరిధిలోని ఛార్జర్లు కనీసం 95శాతం సమయం పనిచేసేలా (అప్‌టైమ్) చూసేందుకు తగిన నిబంధనలు రూపొందించారు.

TGNPDCL పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 169 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల విషయంలో సర్వే, డిజైన్, సరఫరా, సివిల్ పనులు, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్‌తో పాటు 10 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను సీపీఓలే చేపడతారు. అర్హులైన బిడ్డర్లకు PM E-DRIVE పథకం కింద, వర్తించే నిబంధనలకు లోబడి సబ్సిడీ కూడా లభిస్తుంది.

రాష్ట్రానికి వ్యూహాత్మక భౌగోళిక ప్రాముఖ్యత ఉందని TG REDCO వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. అనేక జాతీయ రహదారులు, ప్రధాన రవాణా కారిడార్లు రాష్ట్రం గుండా వెళుతుండటంతో ఎక్కువ మెుత్తంలో అంతర్-రాష్ట్ర ప్రయాణం, సరుకు రవాణా జరుగుతోందని తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More