హైదరాబాద్ నగరం మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన అప్డేట్ అందించింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పిట్-లైన్ (రైలు బాపతు నిర్వహణ లైన్) విస్తరణ, మరమ్మతు పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో…. అక్కడి నుంచి రాకపోకలు సాగించే రెండు కీలక రైళ్ల టెర్మినల్ స్టేషన్లను తాత్కాలికంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు 2026 నవంబర్ 05 వరకు అమల్లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
మారిన రైళ్ల వివరాలు :
- వికారాబాద్ – కాచిగూడ ప్యాసింజర్ (రైలు సంఖ్య 57606): సాధారణంగా వికారాబాద్ నుంచి బయలుదేరి కాచిగూడ వరకు వచ్చే ఈ ప్యాసింజర్ రైలు, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు కాచిగూడకు బదులుగా చర్లపల్లి వద్దనే తన ప్రయాణాన్ని ముగిస్తుంది.
- కాచిగూడ – రేపల్లె ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17625): రోజువారీ ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడకు బదులుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

{{^htLoading}} {{/htLoading}}
ఈ వారం రోజులలో సదరు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు మార్చిన టెర్మినల్ స్టేషన్ల వివరాలను గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టేషన్లలో మైక్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}