TG CPGET 2026 Notification : టీజీ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం

TG CPGET 2026 Notification : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG CPGET-2026 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. మే 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానుండగా... జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

Published on: May 14, 2026, 05:12:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) తరపున కాకతీయ విశ్వవిద్యాలయం ‘TG CPGET-2026’ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు.

టీజీ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల
టీజీ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల

ఈనెల 15 నుంచి దరఖాస్తులు….

నోటిఫికేషన్ ప్రకారం..... మే 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 800 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగులకు (PH) 600 రూపాయల ఫీజు ఉంటుంది. అదనపు సబ్జెక్టులు రాయాలనుకునే వారు ప్రతి సబ్జెక్టుకు 450 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

టీజీ సీపీగెట్ 2026 - ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం : మే 15, 2026
  • రుసుము లేకుండా చివరి తేదీ : జూన్ 10, 2026
  • 500 రూపాయల ఆలస్య రుసుముతో : జూన్ 14, 2026
  • 2000 రూపాయల భారీ ఆలస్య రుసుముతో : జూన్ 18, 2026
  • దరఖాస్తుల సవరణ (Correction): జూన్ 16 నుండి 19 వరకు
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 28, 2026 నుంచి

సీపీగెట్ ప్రవేశ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహిస్తారు. జూలై 2026 మొదటి వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. పరీక్ష ముగిసిన అనంతరం, జూలై 17న ప్రాథమిక కీ (Preliminary Key) విడుదల చేస్తారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 19 వరకు సమర్పించవచ్చు. ప్రతి అభ్యంతరానికి 200 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది, ఒకవేళ అభ్యంతరం సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది.

"విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం" అని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ఫలితాలు, ర్యాంకుల ప్రకటన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కన్వీనర్ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More