...
...
Next Story

TG CPGET 2026 Results : రేపు టీజీ సీపీగెట్‌ 2026 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

TG CPGET 2026 Results : తెలంగాణ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను https://cpget.tgche.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.

Published on: Aug 4, 2026, 11:28:26 IST
Advertisement

TG CPGET 2026 Results : రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్‌-2026 (TG CPGET-2026) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలను రేపు (ఆగస్టు 5న) మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేయనున్నట్లు టీజీ సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

టీజీ సీపీగెట్ 2026 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :

టీజీ సీపీగెట్ ఫలితాలు
టీజీ సీపీగెట్ ఫలితాలు

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్ విధానంలో సులభంగా పొందవచ్చు. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి…

  • ముందుగా టీజీ సీపీగెట్ అధికారిక వెబ్‌సైట్ https://cpget.tgche.ac.in/CPGET ను సందర్శించాలి.
  • హోమ్ పేజీలో కనిపించే 'TG CPGET-2026 Results / Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నిర్ణీత బాక్సుల్లో నమోదు చేయాలి.
  • వివరాలు ఎంటర్ చేసిన తర్వాత 'Submit' లేదా 'Get Rank Card' పై క్లిక్ చేయాలి.
  • వెంటనే మీ స్క్రీన్ పై ర్యాంక్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది.
  • భవిష్యత్ కౌన్సెలింగ్ అవసరాల కోసం దానిని ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంకు కార్డు చాలా కీలకం.

సీపీగెట్ ర్యాంకుల ఆధారంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎంఏ (MA), ఎంఎస్సీ (M.Sc), ఎంకామ్ (M.Com) తో పాటు పలు పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటేడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU), తెలంగాణ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH), మరియు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (కోటి ఉమెన్స్ కాలేజ్) వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe