TG DOST 2026 Special Phase Counseling : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. 'దోస్త్' ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో (జూలై 27, 2026) ముగియనుంది. డిగ్రీ ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ఏ విడతలోనూ సీటు పొందని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రాసెస్ పూర్తి చేయడానికి జూలై 27, 2026 వరకు మాత్రమే అవకాశం కల్పించారు.
ఈనెల 30న సీట్ల కేటాయింపు…
వికలాంగులు (PH), సైనిక ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్, ఇతర పాఠ్యేతర కార్యకలాపాలకోటా ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఇవాళ యూనివర్సిటీ హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధృవీకరణ పత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన జరుగుతుంది. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపును జూలై 30, 2026న పూర్తి చేయనున్నారు.
ఈ ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవడానికి కొన్ని కీలక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా…
- ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : సీటు కేటాయించిన విద్యార్థులు జూలై 30, 2026 నుండి ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- కాలేజీలో ఒరిజినల్ పత్రాల సమర్పణ : ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు జూలై 31, 2026 నుండి ఆగస్టు 01, 2026 మధ్య తమ ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)తో పాటు ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలను కేటాయించిన కళాశాలలో సమర్పించాలి.
- నిర్దేశిత గడువులోగా కాలేజీలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది.
ఇంతవరకు దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా అప్లై చేసుకోవచ్చు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఇప్పటివరకు జరిగిన ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన అభ్యర్థులు తమ పాత ఐడీ, పిన్ (PIN) ఉపయోగించి నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}ఇంతవరకు దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా అప్లై చేసుకోవచ్చు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఇప్పటివరకు జరిగిన ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన అభ్యర్థులు తమ పాత ఐడీ, పిన్ (PIN) ఉపయోగించి నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}గత విడతలలో సీటు వచ్చి, ఆ కాలేజీ నచ్చకపోవడంతో కొత్తగా వేరే కాలేజీకి మారాలనుకునే అభ్యర్థులు కూడా ఈ ప్రత్యేక విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు సీటు లభించే అవకాశాలను పెంచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అలాట్ మెంట్ వివరాలను కూడా ఇదే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.