...
...
Next Story

TG DOST 2026 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' వెబ్ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

TG DOST 2026 Web Options : టీజీ దోస్త్ - 2026 ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా… వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది.

Published on: May 8, 2026, 10:52:18 IST
Advertisement

TG DOST 2026 Web Options : డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. ఇప్పటికే మొదటి విడత రిజిస్ట్రేషన్లు పూర్తి అయిన నేపథ్యంలో…. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గడువు కూడా నేటితో (మే 08) పూర్తి కానుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు… తప్పకుండా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దోస్త్ అడ్మిషన్లు
దోస్త్ అడ్మిషన్లు

దోస్త్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన ప్రాసెస్. విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్లు ఇచ్చాక… గడువు ముగిసే వరకు వాటిని ఎన్నిసార్లైనా మార్చుకునే సదుపాయం ఉంటుంది. కానీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోకపోతే సీట్ల కేటాయింపు ఉండదు. కాబట్టి ఆయా విద్యార్థులు ఈ ప్రాసెస్ తప్పకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈనెల 14న సీట్ల కేటాయింపు…

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది. గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

దోస్త్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.

  • దోస్త్ ముఖ్యమైన తేదీలు ఇవే:
  • వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ : మే 8, 2026 వరకు
  • మొదటి విడత సీట్ల కేటాయింపు: మే 14, 2026
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుండి మే 23, 2026 వరకు
  • అధికారిక వెబ్ సైట్ - https://dost.cgg.gov.in

ఈ లింక్ పై క్లిక్ చేసి దోస్త్ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks